AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: బషీర్ ‘పాంచ్’ పటాకా.. టీమిండియా ఆలౌట్‌.. ఇంగ్లండ్‌పై మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఎంతంటే?

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 477 పరుగులకు ఆలౌట్‌ అయింది. రోహిత్‌ శర్మ(103), శుభ్‌మన్‌ గిల్‌(110), దేవ్‌దత్‌ పడిక్కల్‌(65), యశస్వి జైస్వాల్‌(57), సర్ఫరాజ్‌ ఖాన్‌(56) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 5 వికెట్లు తీశాడు.

IND vs ENG: బషీర్ 'పాంచ్' పటాకా.. టీమిండియా ఆలౌట్‌.. ఇంగ్లండ్‌పై మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఎంతంటే?
India Vs England
Basha Shek
|

Updated on: Mar 09, 2024 | 10:40 AM

Share

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 477 పరుగులకు ఆలౌట్‌ అయింది. రోహిత్‌ శర్మ(103), శుభ్‌మన్‌ గిల్‌(110), దేవ్‌దత్‌ పడిక్కల్‌(65), యశస్వి జైస్వాల్‌(57), సర్ఫరాజ్‌ ఖాన్‌(56) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 5 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు కుప్పకులింది. దీంతో భారత్ ప్రస్తుతం 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా ఈ మ్యాచ్ లో కుల్ దీప్ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో 700 వికెట్లు తీసుకున్న తొలి పేసర్ గా జేమ్స్ అండర్సన్ రికార్డుల కెక్కాడు. 457/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన కుల్‌దీప్‌ యాదవ్‌ (30), జస్‌ప్రీత్‌ బుమ్రా మరో 20 పరుగులు జోడించి ఔటయ్యాడు. కుల్ దీప్ ను అండర్స న్ బోల్తా కొట్టించగా, బుమ్రా బషీర్ స్పిన్ వలకు చిక్కాడు. దీంతో టీమిండియా 477 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో  259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది భారత జట్టుకు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్ జాక్ క్రాలే (79) హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ మిగిలిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ధాటికి క్రీజులో నిలదొక్కుకోవడంలో ఇబ్బంది పడడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా తరఫున కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా, అశ్విన్ 4 వికెట్లు తీశాడు.  ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు యశశ్వ జైస్వాల్‌, రోహిత్‌ శర్మ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 104 పరుగులు చేసిన తర్వాత జైస్వాల్ (57) ఔటయ్యాడు. రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) భారీ సెంచరీతో చెలరేగారు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధ సెంచరీలతో మెరిశారు. ఫలితంగా 2వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 450 పరుగుల మార్కును దాటింది.

700 వికెట్ల క్లబ్ లో జేమ్స్ అండర్సన్..

మరిన్ని క్రీడా వార్తలు, కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి