T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ నుంచి కోహ్లీ ఔట్.. విరాట్ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్‌కు ఛాన్స్
వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడా? అతని స్థానంలో ఓ యంగ్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ ఆలోచనలు చేస్తుందా? ఇక పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ టీమిండియా జెర్సీ ధరించడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడా? అతని స్థానంలో ఓ యంగ్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ ఆలోచనలు చేస్తుందా? ఇక పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ టీమిండియా జెర్సీ ధరించడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ కూడా ఆడని కోహ్లి రాబోయే టీ 20 వరల్డ్ కప్‌లోనూ కనిపించకపోవచ్చు. ఈ పొట్టి ప్రపంచ కప్‌కు విరాట్‌ను పరిగణలోకి తీసుకోకూడదని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌కు జట్టును సిద్దం చేసే ప్రణాళికల్లో భాగంగా విరాట్ కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి తీసుకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి బంతి నుంచే అటాకింగ్ చేయగల కిషన్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తే జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తుందని సెలెక్టర్లు అభిప్రాయ పడినట్లు సమాచారం. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా బరిలోకి దిగాలని రోహిత్ శర్మను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. అందుకు హిట్‌మ్యాన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. రోహిత్‌తో పాటు జస్ ప్రీత్ బుమ్రా కూడా టీ 20 వరల్డ్ కప్‌లో ఆడాలని ఆసక్తి చూపించగా, అందుకు కూడా బీసీసీఐ సెలెక్టర్లు అంగీకరించారని తెలుస్తోంది.
ఐపీఎల్ లో రాణిస్తేనే..
ఇదిలా ఉంటే టీ 20 ప్రపంచ కప్ కు ముందు ఐపీఎల్ సీజన్ జరగనుంది. ఒకవేళ ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేస్తే టీ20 వరల్డ్ కప్‌కు పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పరాజయం అనంతరం క్రికెట్‌కు దూరంగా ఉన్న కోహ్లీ.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో లండన్‌లో విశ్రాంతి సమయాన్ని గడుపుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగమైనా కేవలం టెస్టులు మాత్రమే ఆడనున్నాడు. వన్డేలు, టీ20లకు సెలెక్టర్లు కోహ్లీని పరిగణనలోకి తీసుకోలేదు.
View this post on Instagram
ఫారిన్ వెకేషన్ లో విరాట్ కోహ్లీ, అనుష్కా దంపతులు..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..