T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024 లోగోను ఆవిష్కరించిన ఐసీసీ.. స్పెషాలిటీ ఏంటంటే?
వచ్చే ఏడాది జూన్ 4 న ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ కొత్త లోగోను ఆవిష్కరించింది. వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌కు, బంగ్లాదేశ్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఇదే లోగో డిజైన్‌ని ఉపయోగించడం విశేషం. T20 ప్రపంచ కప్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ లోగోలో

వచ్చే ఏడాది జూన్ 4 న ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ కొత్త లోగోను ఆవిష్కరించింది. వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌కు, బంగ్లాదేశ్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఇదే లోగో డిజైన్‌ని ఉపయోగించడం విశేషం. T20 ప్రపంచ కప్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ లోగోలో బ్యాట్, బంతి, ఆటగాళ్ల ఎనర్జీని సూచించేలా లోగోను డిజైన్ చేశారు. ఈ లోగో డిజైన్‌ను ఆవిష్కరించిన వీడియో ఐసీసీ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా క్రికెట్ ప్రేమికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈసారి పురుషుల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. టీ20 ప్రపంచకప్ జూన్ 4, 2024 నుంచి జూన్ 30 వరకు జరగనుంది. 20 జట్లు తలపడే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఎనిమిది సూపర్-8 మ్యాచ్‌లు ఆడతాయి. సూపర్-8లో పోటీపడుతున్న 8 జట్లలో టాప్-4 జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీమిండియా ఈసారైనా
టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన తర్వాత ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఇక తొలి ఎడిషన్ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా టైటిల్ గెలవలేకపోయింది. మరి 9వ ఎడిషన్‌లో భారత జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.
T20 ప్రపంచకప్‌లో పోటీపడే జట్లు:
- భారతదేశం
- ఆఫ్ఘనిస్తాన్
- ఆస్ట్రేలియా
- బంగ్లాదేశ్
- కెనడా
- ఇంగ్లండ్
- ఐర్లాండ్
- నమీబియా
- నేపాల్
- నెదర్లాండ్స్
- న్యూజిలాండ్
- ఒమన్
- పాకిస్తాన్
- పాపువా న్యూ గినియా
- స్కాట్లాండ్
- దక్షిణ ఆఫ్రికా
- శ్రీలంక
- ఉగాండా
- USA
- వెస్టీండీస్
ఐసీసీ షేర్ చేసిన వీడియో
Created from the three things that define T20I cricket – Bat, Ball, and Energy! 🤩
A striking new look for the ICC T20 World Cup 🏆 💥 ⚡️#T20WorldCup pic.twitter.com/kflsHr81eN
— ICC (@ICC) December 7, 2023
గత వరల్డ్ కప్ లోగోలు ఇవిగో..
T20 world cup ka Kaun sa logo best hai?#T20WorldCup2024 pic.twitter.com/ofxb8Sqpc3
— Rahul Kashyap Rajput🇮🇳 (@therahulkrajput) December 7, 2023
ఐసీసీ ర్యాంకింగ్స్ లో రవి బిష్ణోయ్ టాప్
Ravi Bishnoi joins Jasprit Bumrah as the only India players to hold the No.1 spot for bowlers on the MRF Tyres ICC Men’s T20I Player Rankings 😲
Details 👇https://t.co/jt2tgtqym5
— ICC (@ICC) December 7, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








