Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ‘మా స్టార్‌ ప్లేయర్‌పై ఆ జట్టు కన్ను.. రూల్స్‌కు విరుద్ధంగా’.. గుజరాత్‌ టీమ్ సంచలన ఆరోపణలు

మెగా టోర్నీ ప్రారంభం కాక ముందే గుజరాత్ టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వదిలి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లిపోయాడు. ఇంతలోనే ఐపీఎల్‌ ట్రేడింగ్‌కు సంబంధించి మరో షాకింగ్‌ వార్త వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ప్లేయర్..

IPL 2024: 'మా స్టార్‌ ప్లేయర్‌పై ఆ జట్టు కన్ను.. రూల్స్‌కు విరుద్ధంగా'.. గుజరాత్‌ టీమ్ సంచలన ఆరోపణలు
Gujarat Titans
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2023 | 7:51 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు అందరి చూపు డిసెంబర్ 19న జరగనున్న ఐపీఎల్‌ మినీ వేలంపైనే ఉంది. ఇదిలా ఉంటే మెగా టోర్నీ ప్రారంభం కాక ముందే గుజరాత్ టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వదిలి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లిపోయాడు. ఇంతలోనే ఐపీఎల్‌ ట్రేడింగ్‌కు సంబంధించి మరో షాకింగ్‌ వార్త వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీని దక్కించుకునేందుకు ఓ ఫ్రాంచైజీ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చిందని సమాచారం. దీనిని గుజరాత్ టైటాన్స్ సీఈఓ కల్నల్ అరవిందర్ సింగ్ స్వయంగా ధ్రువీకరించారు. ఇదే నిజమైతే శుభమన్‌ గిల్‌ టీమ్‌కు మరో షాక్‌ తప్పకపోవచ్చు. ‘మహ్మద్ షమీ కోసం ఒక ఐపీఎల్‌ ప్రాంఛైజీ సంప్రదించిన మాట వాస్తవమే. అయితే ఈ పద్ధతి ఐపీఎల్ లావాదేవీలకు బీసీసీఐ నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధం’ అని గుజరాత్ టైటాన్స్ సీఈఓ చెప్పుకొచ్చారు. అయితే, తమను సంప్రదించిన జట్టు పేరు మాత్రం వెల్లడించలేదు కల్నల్ అరవిందర్. ముంబై ఇండియన్స్ ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఇప్పుడు మహ్మద్ షమీపై కొన్ని జట్లు కన్ను వేయడంతో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఆందోళనను పెంచింది.

షమీ కోసం రూల్స్ కు విరుద్ధంగా

మొత్తం మీద, IPL ట్రేడ్ ప్రక్రియకు డిసెంబర్ 12 వరకు సమయం ఉంది. ఈ సమయంలో ఒక ఫ్రాంచైజీ మహ్మద్ షమీ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇది విజయవంతమైతే, వేలానికి ముందు షమీ కొత్త జట్టులో భాగం కావచ్చని తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ చివరి సీజన్‌లో మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. 17 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతే కాకుండా ఈ వన్డే ప్రపంచకప్‌లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఈ కారణంగా, కొన్ని ఫ్రాంచైజీలు షమీని దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్ నిలబెట్టుకున్న ఆటగాళ్లు:

డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..