AUS vs PAK: కెప్టెన్ కంటే ఎక్కువ జీతం.. అయినా, ప్లేయింగ్ 11లో నోఛాన్స్.. ఆ పాక్ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
Pakistan Cricket Team: జనవరి 14 నుంచి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు సుమారు 8 రోజుల ముందు పాకిస్థాన్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్‌కు ముందే, టెస్టు సిరీస్‌కు వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేస్తామో పాక్ కెప్టెన్ షాన్ మసూద్ ప్రకటించాడు. దీంతో ఓ స్టార్ ప్లేయర్‌కు భారీ షాక్ ఇచ్చాడు.

మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం పాక్ జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుని సన్నాహాలు ప్రారంభించింది. 2023 ప్రపంచకప్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత పాక్ జట్టు ఈ సిరీస్‌తో తొలిసారిగా రంగంలోకి దిగనుంది. అయితే సిరీస్ ప్రారంభం కాకముందే జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అది కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అత్యధిక జీతం ఇచ్చే ఆటగాడు కావగం గమనార్హం. ఆ ఆటగాడి పేరు మహ్మద్ రిజ్వాన్.
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు డిసెంబర్ 6వ తేదీ బుధవారం నుంచి పాకిస్థాన్ జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు, రిజ్వాన్‌కు టెస్టు సిరీస్‌లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా ప్రాధాన్యత లభించదని పాకిస్థాన్ జట్టు కొత్త కెప్టెన్ షాన్ మసూద్ స్పష్టం చేశాడు.
సర్ఫరాజ్ నంబర్ 1 కీపర్‌గా..
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పాక్ కెప్టెన్ ఏ ఆటగాడితో బరిలోకి దిగాలనుకుంటున్నాడు? దీనికి షాన్ మసూద్ కూడా సమాధానమిచ్చాడు. టెస్టు సిరీస్ సందర్భంగా మాజీ కెప్టెన్, అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మాత్రమే తొలి అవకాశం ఇస్తానని మసూద్ స్పష్టం చేశాడు. దీనికి కారణం కూడా మసూద్ చెప్పాడు. గత టెస్ట్ సిరీస్ (పాకిస్తాన్-న్యూజిలాండ్)లో సర్ఫరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడని, దేశవాళీ టోర్నమెంట్‌లో కూడా చాలా పరుగులు సాధించాడని, అందుకే అతన్ని ఎంపిక చేస్తామని కొత్త పాక్ కెప్టెన్ స్పష్టంగా తెలిపాడు.
పీసీబీ కాంట్రాక్ట్‌లు..
Pakistan captain Shan Masood’s media talk on the eve of the four-day game against PM’s XI.#AUSvPAK pic.twitter.com/3jCzoRpiX0
— Pakistan Cricket (@TheRealPCB) December 5, 2023
ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించినందున పాకిస్థాన్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆటగాళ్లను 4 కేటగిరీలుగా విభజించారు. టాప్ కేటగిరీ ‘ఎ’లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. వీరికి అత్యధిక జీతం (నెలకు 45 లక్షల పాకిస్థానీ రూపాయలు) లభిస్తుంది. బాబర్ ఆజం, షాహీన్ షా ఆఫ్రిదితోపాటు మూడో ఆటగాడిగా రిజ్వాన్ ఉన్నాడు. దీనికి కారణం అతను మూడు ఫార్మాట్లలో నిరంతరాయంగా ఆడుతున్నాడు.
సర్ఫరాజ్ విషయానికి వస్తే, అతన్ని డి కేటగిరీలో ఉంచారు. ఇందులో నెలవారీ జీతం దాదాపు 5 లక్షల పాకిస్థానీ రూపాయలు. షాన్ మసూద్ అంతకుముందు డి కేటగిరీలో ఉన్నాడు. కానీ, కెప్టెన్ అయిన తర్వాత, అతను బి కేటగిరీకి (సుమారు 28 లక్షలు) పదోన్నతి పొందాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..