Team India: కోహ్లీతో కలిసి ప్రపంచకప్ గెలిచాడు.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చిన టీమిండియా ప్లేయర్..
Saurabh Tiwary Announced Retirement: తన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ 2006లో ఆడిన ఈ భారత ఆటగాడు.. ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడి 22 సెంచరీలతో సహా 8030 పరుగులు చేశాడు. అలాగే, 116 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 46.55 సగటు, 6 సెంచరీలతో సహా 4050 పరుగులు చేశాడు. ఇలాంటి క్రమంలో తన రిటైర్మెంట్ ప్రకటించి, అందరికి షాక్ ఇచ్చాడు.
Saurabh Tiwary Announced Retirement: 2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌కు ప్రపంచకప్ అందించిన సౌరభ్ తివారీ ఇప్పుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న 34 ఏళ్ల సౌరభ్, జార్ఖండ్ తరపున తన చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఆ తర్వాత అతను రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. 11 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించిన సౌరభ్, 2006-07 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.
అప్పటి నుంచి సౌరభ్ జార్ఖండ్ జట్టు తరపున రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. కానీ, జార్ఖండ్ జట్టు తొలి సీజన్‌లో రాణించలేకపోయింది. ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
EPSNcricinfo నివేదిక ప్రకారం, తన రిటైర్మెంట్ గురించి పంచుకున్న సౌరభ్ తివారీ.. ఈ ప్రయాణానికి వీడ్కోలు చెప్పడం కొంచెం కష్టమని చెప్పుకొచ్చాడు. అయితే దీనికి ఇదే సరైన సమయమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను జాతీయ జట్టు, ఐపీఎల్‌లో ఆడడం లేదు. అందుకే రాష్ట్ర యువ క్రీడాకారులకు అవకాశం కల్పించేందుకు క్రికెట్ కు దూరమవుతున్నట్లు తెలిపాడు.
సౌరభ్ తివారీ 2006లో తన మొదటి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడి 22 సెంచరీలతో సహా 8030 పరుగులు చేశాడు. ఇంకా, అతను 116 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 46.55 సగటుతో 6 సెంచరీలతో సహా 4050 పరుగులు చేశాడు.
ఇది కాకుండా, టీమిండియాలో కనిపించిన సౌరభ్ జాతీయ జట్టు తరపున మూడు వన్డేలు ఆడాడు. అందులో అతను 49 పరుగులు మాత్రమే చేశాడు.
भारत की तरफ़ से तीन वनडे खेलने वाले झारखंड के क्रिकेटर सौरभ तिवारी ने अंतर्राष्ट्रीय और प्रथम श्रेणी क्रिकेट से संन्यास की घोषणा कर दी है।
उन्होंने युवाओं को मौक़ा देने की बात कहते हुए संन्यास की घोषणा की है।#RanjiTrophy #SaurabhTiwary https://t.co/5kx8G0ZXRD
— ESPNcricinfo हिंदी (@CricinfoHindi) February 12, 2024
సౌరభ్ తివారీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌లకు ఆడాడు. భారత రిచ్ లీగ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొత్తం 93 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తివారీ 28.73 సగటుతో 8 అర్ధసెంచరీలతో సహా 1494 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..