AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI Records: వన్డే కెరీర్‌లో బ్యాడ్ లక్ ప్లేయర్లు వీరే.. ఆ ఒక్క పరుగు కోసం వణికిపోతుంటారు.. లిస్టులో మనోడే టాప్

క్రికెట్ (Cricket) ఆడే ప్రతి ఆటగాడు తన కెరీర్‌లో ఎన్నో సెంచరీలు, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలని కలలు కంటుంటాడు. ఈ సిరీస్‌లో చాలామంది వెటరన్ క్రికెటర్లు తమ కెరీర్‌లో ఈ మైలురాయిని సాధించారు.

ODI Records: వన్డే కెరీర్‌లో బ్యాడ్ లక్ ప్లేయర్లు వీరే.. ఆ ఒక్క పరుగు కోసం వణికిపోతుంటారు.. లిస్టులో మనోడే టాప్
Cricket
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 03, 2024 | 4:25 PM

Share

క్రికెట్ (Cricket) ఆడే ప్రతి ఆటగాడు తన కెరీర్‌లో ఎన్నో సెంచరీలు, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలని కలలు కంటుంటాడు. ఈ సిరీస్‌లో చాలామంది వెటరన్ క్రికెటర్లు తమ కెరీర్‌లో ఈ మైలురాయిని సాధించారు. ఈ బ్యాట్స్‌మెన్స్ తమ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సెంచరీలు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఏ క్రికెటర్ అయినా సెంచరీ సాధించాలంటే చాలా కష్టపడాల్సిందే. చాలాసార్లు ఆటగాళ్ళు 90, 99 మధ్య అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. దీనిని మనం ఆధునిక క్రికెట్‌లో 90 ఫీవర్ అని కూడా పిలుస్తుంటారు. ఇప్పటి వరకు, తమ కెరీర్‌లో చాలాసార్లు తొంభైల బాధితులుగా మారిన ఇలాంటి లెజెండరీ ప్లేయర్‌లు చాలా మంది ఉన్నారు.

ఈ కథనంలో ODI కెరీర్‌లో తొంభైలలో పెవిలియన్ చేరిన ప్రపంచంలోని నలుగురు దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

4. అరవింద్ డి సిల్వా – 9 సార్లు..

ఈ జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద్ డిసిల్వా నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 1984, 2003 మధ్య తన కెరీర్‌లో మొత్తం 308 ODI మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, డి సిల్వా 34.90 సగటుతో మొత్తం 9284 పరుగులు చేశాడు. అతను 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు. అరవింద డి సిల్వా తన వన్డే కెరీర్‌లో మొత్తం 11 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ కాలంలో అతను 9 సార్లు తొంభైల్లో బాధితుడిగా మారాడు. అరవింద్ డి సిల్వా శ్రీలంక దిగ్గజ ఆటగాళ్ళలో ఒకడిగా పేరుగాంచాడు. అతను తన స్వంతంగా జట్టు కోసం అనేక మ్యాచ్‌లను గెలిచాడు. కానీ, అతని పేరు మీద ఈ ప్రత్యేకమైన రికార్డు కూడా ఉంది.

3. నాథన్ ఆష్లే – 9 సార్లు..

నాథన్ ఆస్ట్లీ న్యూజిలాండ్ మాజీ లెజెండరీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. 1995 నుంచి 2007 వరకు, నాథన్ ఆస్ట్లీ కివీ జట్టు తరపున మొత్తం 223 ODI మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతను 217 ఇన్నింగ్స్‌లలో 34.92 సగటుతో 7090 పరుగులు చేశాడు. అతని ODI కెరీర్‌లో, నాథన్ ఆస్ట్లీ 16 సెంచరీలు, 41 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ కాలంలో అతను 9 సార్లు తొంభైల్లో పెవిలియన్ చేరాడు.

2. గ్రాంట్ ఫ్లవర్ – 9 సార్లు..

జింబాబ్వే వన్డే జట్టు మాజీ కెప్టెన్ గ్రాంట్ ఫ్లవర్ ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకటిగా పేరుగాంచాడు. జింబాబ్వే తరపున అతను అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. అతని ODI కెరీర్‌లో, గ్రాంట్ ఫ్లవర్ 221 ODI మ్యాచ్‌లు ఆడాడు. 33.52 సగటుతో 6571 పరుగులు చేశాడు. ఈ కాలంలో, గ్రాంట్ ఫ్లవర్ తన కెరీర్‌లో 6 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు సాధించాడు. మొత్తం 9 సార్లు తొంభైల్లో బాధితుడిగా మారాడు.

1. సచిన్ టెండూల్కర్ – 18 సార్లు..

సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 49 సెంచరీలు సాధించడం ఒక రికార్డు. అయితే, ఈ శతకాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. అవును, సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సార్లు తొంభైల బారిన పడిన అవాంఛిత రికార్డును కలిగి ఉన్నాడు. అతను తన కెరీర్‌లో మొత్తం 18 సార్లు తొంభైలలో ఔట్ అయ్యాడు.

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..