AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కోహ్లీ ‘డ్రీమ్ హౌస్’ చూశారా.. అలీబాగ్‌లో ఔరా అనిపించేలా నిర్మాణం.. ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే?

Virat kohli Share Glimpse Stunning Luxury Home: టీ20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో 2వసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ప్రపంచకప్ విజయం తర్వాత ఆటగాళ్లంతా తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా, విరాట్ తన కుటుంబంతో లండన్‌లో సెలవులు గడుపుతున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత X ఖాతాలో అలీబాగ్‌లోని తన ఇంటిని తొలిసారి పంచుకున్నాడు.

Video: కోహ్లీ 'డ్రీమ్ హౌస్' చూశారా.. అలీబాగ్‌లో ఔరా అనిపించేలా నిర్మాణం.. ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే?
Virat Kohli Dream Home
Venkata Chari
|

Updated on: Jul 10, 2024 | 3:50 PM

Share

Virat kohli Share Glimpse Stunning Luxury Home: టీ20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో 2వసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ప్రపంచకప్ విజయం తర్వాత ఆటగాళ్లంతా తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా, విరాట్ తన కుటుంబంతో లండన్‌లో సెలవులు గడుపుతున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత X ఖాతాలో అలీబాగ్‌లోని తన ఇంటిని తొలిసారి పంచుకున్నాడు. ఈ వీడియాలో ఆ ఇంటి నిర్మాణంలో జరిగిన మొత్తం కథను చూపించాడు. విరాట్ కోహ్లీ తన డ్రీమ్ హౌస్ వీడియోను ఇంటి ఇంటీరియర్, గార్డెన్‌‌ను ఈ వీడియోలో అభిమానులతో పంచుకున్నాడు.

రూ. 13 కోట్ల విలువైన ఇల్లు..

విరాట్ కోహ్లి నిర్మించుకున్న ఈ బంగ్లా ధర సుమారు రూ. 13 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎంతో విశాలంగా, పక్కనే సముద్రం, అద్భుతమైన ఇంటీరియర్ ఇలా ఎన్నో విలువైన వస్తువులను ఆ ఇంట్లో చూడొచ్చు.

62 సెకన్ల వీడియో..

విరాట్ కోహ్లీ 62 సెకన్ల క్లిప్‌ను పంచుకుంటూ “అలీబాగ్‌లో మా ఇంటిని నిర్మించే ప్రయాణం సున్నితమైన అనుభవం” అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. “ప్రయాణం తర్వాత ఈ క్షణం చాలా సంతృప్తికరంగా ఉంది. దీనితో పాటు, ఇంటి నిర్మాణానికి సహకరించిన మొత్తం బృందానికి విరాట్ తన కృతజ్ఞతలు తెలిపాడు. మా కలల ఇంటిని సాకారం చేసినందుకు మొత్తం టీమ్‌కు చాలా కృతజ్ఞతలు తెలిపాడు. నా ప్రియమైన వారితో ఇక్కడ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఇంక నేను అస్సలు వేచి ఉండలేను” అంటూ చెప్పుకొచ్చాడు.

నివసించే ఇంటిని ఇష్టపడతాను..

విరాట్ కోహ్లీ తన ఇంటి గురించి మాట్లాడుతూ, నేను నివసించే స్థలాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. నివాస స్థలం సౌకర్యవంతంగా ఉండాలి. ఇంటి లోపలి భాగంలో సహజ కాంతి కూడా ఉంటుంది. సహజ కాంతిలో ఉండటం నాకు చాలా ఇష్టం. ఈ ఇల్లు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ఆందోళన లేకుండా జీవించవచ్చు అంటూ కోహ్లీ తెలిపాడు.

నేను అనుకున్నట్లుగానే..

‘విరాట్ కోహ్లీ ఇంటి ప్లాన్ గురించి మాట్లాడుతూ, నేను ఇంటిని నిర్మించే ప్లాన్ విన్నప్పుడు, ఈ ప్రాజెక్ట్ చాలా భిన్నంగా ఉందని తెలిపాడు. నాకు కావలసిందల్లా హాలిడే హోమ్. దాని పక్కనే ప్రపంచ స్థాయి స్పా కూడా ఉంది. ఇది నాకు ఎంతో స్పెషల్. వీటన్నింటిని కలపి ఉంచడం నాకు అంత తేలికైన పని కాదు. ఇంటి నిర్మాణం పూర్తయినప్పుడు, అది నాకు నచ్చినట్లు, నేను ఊహించినట్లుగా వచ్చింది అంటూ తన అనుభూతను వివరించాడు.

సమాచారం ప్రకారం, ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కొన్ని వారాల పాటు విరామంలో ఉంటాడు. విరాట్ కోహ్లీకి అకాయ్, కూతురు వామిక ఉన్నారు. అతను తన జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచేందుకు ఇష్టపడుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..