ఐపీఎల్‌లో సొంత జట్టుకు ఆడని ఐదుగురు స్టార్ క్రికెటర్లు ఎవరో తెలుసా.? లిస్టులో తోపు బ్యాటర్..
16 సీజన్లు ముగిశాయి. ఐపీఎల్ 17వ ఎడిషన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా ఎంతోమంది దేశీయ, విదేశీ ఆటగాళ్లు ఒకట్రెండు కంటే ఎక్కువ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. కానీ కొంతమంది స్టార్ ఆటగాళ్లు తమ సొంత జట్లకు ఇప్పటికీ ఎందుకు ప్రాతినిధ్యం వహించలేదో మీరెప్పుడైనా ఆలోచించారా.? మరి ఆ ప్లేయర్స్ ఎవరో చూసేద్దాం.

ఐపీఎల్ 2024కి సమయం ఆసన్నమైంది. మార్చి 22 నుంచి జరగబోయే ఈ టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. ఈ రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్.. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లను ఎంతోమందిని ఒకతాటి మీదకు తీసుకొస్తుంది. అయితే ఇప్పటికీ కొందరు క్రికెటర్లు తమ సొంత జట్లకు ప్రాతినిధ్యం వహించలేదు. లిస్టులో టీమిండియా రన్ మిషన్ కూడా ఉన్నాడు. మరి లేట్ ఎందుకు 16 సీజన్లు అయినా కూడా ఇప్పటికీ సొంత ఫ్రాంచైజీకి ఆడని ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూసేద్దామా..
-
విరాట్ కోహ్లీ.. 2008లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ విరాట్ కోహ్లీ వేలంలో కొనుగోలు చేసేందుకు విముఖత చూపించింది. ఆ సమయంలో ఆర్సీబీ కోహ్లీని సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి 16 సీజన్లు ముగిసినా.. ఫ్రాంచైజీ మారలేదు విరాట్ కోహ్లీ.
-
దినేష్ కార్తీక్.. ఈ టీమిండియా సీనియర్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిపి మొత్తంగా 6 ఫ్రాంచైజీల తరపున ఆడాడు. అయితే తన సొంత రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున ఆడే అవకాశం రాలేదు.
-
హర్భజన్ సింగ్.. ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌లో చాలా కాలం పాటు కొనసాగాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు భజ్జీ. కానీ హర్భజన్ సింగ్ ఎప్పుడూ పంజాబ్ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ ఆడలేదు.
-
జస్‌ప్రీత్ బుమ్రా.. ముంబై ఇండియన్స్‌కి కీ-ప్లేయర్‌గా ఉన్నాడు ఈ టీమిండియా స్వింగ్ కింగ్.. బరోడా తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన బుమ్రా.. 5 సార్లు IPL విజేతగా నిలిచిన ముంబై జట్టు సభ్యుడు. కానీ తన సొంత ఫ్రాంచైజీలు గుజరాత్ లయన్స్, గుజరాత్ టైటాన్స్ తరపున ఆడే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయాడు.
-
శుభ్‌మాన్ గిల్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఈ యువ బ్యాటర్. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టులోకి చేరాడు. కానీ తన సొంత ఫ్రాంచైజీ పంజాబ్ తరపున మాత్రం ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆడలేదు.
ఇది చదవండి: కోల్‌కతా కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్‌కి ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్?




