AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కోల్‌కతా కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్‌కి ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్?

Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని కోల్పోయినప్పుడు, అతని భార్య రితిక ఒక పోస్ట్‌పై వ్యాఖ్యానించడంతో మరింత వివాదం తలెత్తింది. ఒక వీడియోలో ఇది జట్టు కోసం క్రికెట్ నిర్ణయం అని జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ పోస్ట్‌పై రితికా కామెంట్ చేస్తూ అందులో చాలా తప్పులున్నాయని పేర్కొంది.

Video: కోల్‌కతా కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్‌కి ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్?
Rohit Sharma Ipl 2024
Venkata Chari
|

Updated on: Mar 19, 2024 | 12:07 PM

Share

IPL 2024: టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున మొత్తం 5 టైటిళ్లు సాధించాడు. అయితే, హార్దిక్ పాండ్యా రాకతో రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 2024లో పాండ్యా కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు. ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించడంతో వివాదం మొదలైంది. ఇది ఎలా జరిగిందో అభిమానులు నమ్మలేకపోతున్నారు. రోహిత్ నాయకత్వంలో, ముంబై జట్టు అత్యుత్తమ స్థానాన్ని సాధించింది. ప్రస్తుతం ముంబై జట్టు సంయుక్తంగా అత్యధిక టైటిళ్లను గెలుచుకున్న జట్టుగా ఉంది.

రోహిత్ కెప్టెన్సీని కోల్పోయినప్పుడు, అతని భార్య రితిక ఒక పోస్ట్‌పై వ్యాఖ్యానించడంతో మరింత వివాదం తలెత్తింది. ఒక వీడియోలో ఇది జట్టు కోసం క్రికెట్ నిర్ణయం అని జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ పోస్ట్‌పై రితికా కామెంట్ చేస్తూ అందులో చాలా తప్పులున్నాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రోహిత్‌పై పాండ్యా ఏం చెప్పాడంటే?

ముంబై ఇండియన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ గురించి హార్దిక్ పాండ్యాను ప్రశ్నలు అడిగారు. రోహిత్‌తో ఇంకా మాట్లాడలేదని, అయితే అతను ఇప్పటికీ టీమ్ ఇండియా కెప్టెన్ అంటూ హార్దిక్ చెప్పుకొచ్చాడు. రోహిత్ నాకు మార్గనిర్దేశం చేస్తాడు, అతని చేయి నా భుజంపైనే ఉంటుంది. రోహిత్ ప్రయాణం చేస్తూ ఆడుతున్నాడు. మేం ఇంకా ఎలాంటి సంభాషణ చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

కేకేఆర్ సారథిగా ఉండాలని కోరుకుంటున్నా..

రోహిత్-పాండ్యా వార్తల మధ్య, హిట్‌మ్యాన్ పాత వీడియో వైరల్ అవుతుంది. అందులో రోహిత్‌ని అవకాశం వస్తే, ముంబై కాకుండా ఏ ఫ్రాంచైజీని కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నారు అని అడిగారు. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ఈడెన్ గార్డెన్స్ నా ఫేవరెట్ గ్రౌండ్ అని, ఆ మైదానంలో నేను చాలా సాధించాను. ఇటువంటి పరిస్థితిలో నేను KKR పేరు తీసుకుంటాను’ అని తెలిపాడు. CNBC TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ ఈ ప్రకటన చేశాడు.

2024 టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రతి భారతీయ ఆటగాడి ఎంపిక రోహిత్ అని తెలిసిందే. ఇటీవల, కుల్దీప్ యాదవ్ కూడా రోహిత్ కెప్టెన్సీకి సంబంధించి పెద్ద ప్రకటన చేశాడు. రోహిత్ యువ ఆటగాళ్లకు చాలా మద్దతు ఇస్తాడని, వారి ప్రతిభను గుర్తిస్తాడని తెలిపాడు. అతను మైదానంలో ఏది మాట్లాడినా, అతనితో ప్రతి ఒక్కరికి భిన్నమైన సంబంధాలు ఉన్నందున ఎవరూ బాధపడరు. ఏది చెప్పినా మనపై ఆయనకున్న ప్రేమే అంటూ తెల్చి చెప్పాడు.

రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ క్యాంప్‌లో చేరాడు. త్వరలో వాంఖడే మైదానంలో మిగతా జట్టు ఆటగాళ్లతో కలిసి రోహిత్ తన శిక్షణను ప్రారంభించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us