INDW vs SAW Highlights: హ్యాట్రిక్ విక్టరీ మిస్.. టీమిండియాకు షాకిచ్చిన సౌతాఫ్రికా..
IND-W vs SA-W Highlights, ICC T20 Women's World Cup: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తన తొలి ఓటమిని చవిచూసింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయంలో మరిజాన్ కాప్ కీలక పాత్ర పోషించింది.

IND-W vs SA-W Highlights, ICC T20 Women’s World Cup: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తన తొలి ఓటమిని చవిచూసింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా, దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
దక్షిణాఫ్రికా విజయంలో మరిజాన్ కాప్ కీలక పాత్ర పోషించింది. ఆమె 45 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 81 పరుగులు చేసింది. కాప్ రెండు వికెట్లు కూడా పడగొట్టింది. ఆమె తాజ్‌మిన్ బ్రిట్స్ (40)తో కలిసి మూడో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
భారత్ తరఫున శ్రీ చరణీ మూడు వికెట్లు తీయగా, షఫాలీ వర్మ ఒక వికెట్ పడగొట్టింది.
అంతకుముందు, షఫాలీ వర్మ 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ 29 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన 200వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో 24 పరుగులు చేసింది. స్మృతి మంధాన 17 పరుగుల వద్ద అవుటయింది.
టీమిండియా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందిని శర్మ, ప్రేమ రావత్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నరీ డెర్క్‌సెన్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, క్లో ట్రయాన్(కీపర్), సినాలో జాఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మలాబా.
LIVE Cricket Score & Updates
-
సౌతాఫ్రికా విజయం..
సౌతాఫ్రికా జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి, టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది సౌతాఫ్రికా. దీంతో భారత్ హ్యాట్రిక్ విజయం మిస్ చేసుకుంది.
-
17 ఓవర్లకు
దక్షిణాఫ్రికా 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. నదీన్ డి క్లర్క్ మరియు మరిజాన్ కాప్ క్రీజులో ఉన్నారు.
-
-
12 ఓవర్లకు
12 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా టీం 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.
-
బ్రేకిచ్చిన తెలుగమ్మాయి..
ఆరో ఓవర్‌లో దక్షిణాఫ్రికాకు వరుసగా రెండు షాక్‌లు తగిలాయి. శ్రీ చరణి కెప్టెన్ వోల్వార్డ్‌ను 20 పరుగుల వద్ద ఔట్ చేసింది. ఆ తర్వాత అన్నెరీ డెర్క్‌సెన్ ను పెవిలియన్ చేర్చింది. దీంతో ఒక్క పరుగు ఇవ్వకుండా 2 వికెట్లు పడగొట్టింది.
-
సౌతాఫ్రికా టార్గెట్ 159
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా ముందు 159 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
-
14 ఓవర్లకు
14 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం భారతమంతా కెప్లెన్ కౌర్, దీప్తిపైనే ఉంది.
-
10 ఓవర్లకు..
10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. కౌర్, జెమియా క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లేలోపే 2 వికెట్లు డౌన్..
పవర్ ప్లే ముగిసేలోపు భారత జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మంధాన, షఫాలీలు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం భారత్ 5.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.
-
2 ఓవర్లకు భారత్..
2 ఓవర్లకు భారత జట్టు 23 పరుగులు చేసింది. స్మృతి మంధాన 12, షఫాలీ వర్మ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
అత్యధిక T20I మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు..:
200 – హర్మన్‌ప్రీత్ కౌర్, 184 – సూజీ బేట్స్, 183 – డానీ వ్యాట్-హాడ్జ్, 177 – ఎలీస్ పెర్రీ, 169 – స్మృతి మంధాన.
పురుషుల T20Iలలో పాల్ స్టిర్లింగ్ (163) అగ్రస్థానంలో ఉండగా, అతని తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (159) ఉన్నారు.
-
మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడినవారు:
220 – షార్లెట్ ఎడ్వర్డ్స్, 200 – హర్మన్‌ప్రీత్ కౌర్, 199 – హెదర్ నైట్, 195 – మిథాలీ రాజ్, 183 – చమరి అథపత్తు, 182 – మెగ్ లానింగ్.
-
South Africa Women Playing XI: సౌతాఫ్రికా టీం ఇదే..
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నరీ డెర్క్‌సెన్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, క్లో ట్రయాన్(కీపర్), సినాలో జాఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మలాబా.
-
India Women Playing XI: హర్మన్ సేన ఇదే..
టీమిండియా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందిని శర్మ, ప్రేమ రావత్.
-
IND-W vs SA-W: టాస్ గెలిచిన భారత్..
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా బౌలింగ్ చేయనుంది.
-
IND-W vs SA-W: సౌతాఫ్రికాకు చావోరేవో మ్యాచ్..
మరోవైపు, ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు చావో రేవో లాంటిది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచింది.
-
IND-W vs SA-W Live Score, ICC T20 Women’s World Cup: స్పెషల్ రికార్డులో లేడీ రోహిత్
నేటి మ్యాచ్‌తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా నిలవనుంది.
-
INDW vs SAW Live Score: భారత్ పరిస్థితి..
భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో, నెదర్లాండ్స్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది.
-
IND-W vs SA-W Live Score: టాస్‌కు రంగం సిద్ధం..
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మాంచెస్టర్‌లో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్ స్థానానికి మరింత చేరువవుతుంది. అంతకు ముందు, బ్రిస్టల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో వెస్టిండీస్, శ్రీలంక జట్లు తలపడతాయి.
Published On - Jun 21,2026 6:19 PM




