Telugu News Sports News Cricket news Team India's Axar Patel gets married to girlfriend Meha in lavish wedding ceremony in Vadodara watch videos Telugu Cricket News
Axar Patel: పెళ్లి పీటలెక్కిన మరో టీమిండియా క్రికెటర్.. ప్రేయసితో కలిసి ఏడడుగులు నడిచిన అక్షర్ పటేల్
స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతోన్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన ప్రేయసి మేహా పటేల్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. గుజరాత్‌లోని వడోదర వేదికగా వీరి వివాహం వేడుకగా జరిగింది.
టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. ఇటీవల స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ బ్యూటీ అతియాశెట్టితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ క్రికెటర్ ఓ ఇంటి వాడయ్యాడు. స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతోన్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన ప్రేయసి మేహా పటేల్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. గుజరాత్‌లోని వడోదర వేదికగా వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అలాగే జయదవ్ ఉనాద్కత్ తదితర టీమిండియా క్రికెటర్లు వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలైన సంగీత్, మెహందీ ఈవెంట్లు కూడా గ్రాండ్‌గా జరిగాయి. సంగీత్ సందర్భంగా అక్షర్– మేహా దంపతులు కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అక్షర్ పటేల్ చాలా కాలంగా మేహాతో ప్రేమలో ఉన్నాడు. గతేడాది తన పుట్టినరోజు (జనవరి 20) సందర్భంగా మేహాకు రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇర మేహా విషయానికొస్తే వృత్తి రీత్యా డైటీషియన్ అలాగే న్యూట్రిషనిస్ట్ కూడా. ఈక్రమంలో అక్షర్ డైట్ విషయంలో ఆమె జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాకుండా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవలే కొత్త కారును కూడా కొనుగోలు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారీ లవ్లీ కపుల్. కాగా పెళ్లి వేడుక కారణంగానే న్యూజీలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు అక్షర్ పటేల్.