- Telugu News Photo Gallery Cricket photos Daniel Vettori Birthday: Interesting Facts And Career Statistics Of New Zealand Legendary Cricketer
3 ఏళ్లకే కళ్లజోడు.. బుడ్డోడంటూ ఎగతాళి.. కట్ చేస్తే 667 వికెట్లు, 7వేలకు పైగా రన్స్‌తో దిగ్గజాల్లో ఒకరిగా..
కేవలం 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. జట్టులోకి వచ్చినప్పుడు అతని రూపాన్ని చూసి తోటి సహచరులే ఎగతాళి చేశారు. కళ్లద్దాలు, చిన్నపిల్లాడి లాంటి ముఖం చూసి 'ది చైల్డ్( బుడ్డోడు)' అని గేలి చేశారట.
Updated on: Jan 27, 2023 | 9:05 AM

ప్రపంచ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లను అందించింది. రిచర్డ్ హాడ్లీ, మార్టిన్ క్రోవ్, గ్లెన్ టర్నర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, డేనియల్ వెటోరి తదితరులు ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. అందులో ముఖ్యుడైన డానియల్ వెటోరి పుట్టిన రోజు నేడు (జనవరి 27).

కేవలం 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. జట్టులోకి వచ్చినప్పుడు అతని రూపాన్ని చూసి తోటి సహచరులే ఎగతాళి చేశారు. కళ్లద్దాలు, చిన్నపిల్లాడి లాంటి ముఖం చూసి 'ది చైల్డ్( బుడ్డోడు)' అని గేలి చేశారట.

వెటోరికి 3 సంవత్సరాల వయస్సులోనే కళ్లద్దాలు వచ్చాయట. దీంతో తన కెరీర్ మొత్తం ఇలాగే ఆడాడని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ప్రసిద్ధ నవల హ్యారీ పోటర్‌లోని హీరో క్యారెక్టర్ కూడా వెటోరిని పోలి ఉంటుంది.

కేవలం 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వెటోరి 18 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. కేవలం 21 ఏళ్ల వయసులో 100 టెస్టు వికెట్లు పూర్తి చేసి ఈ మైలురాయిని చేరుకున్న అతి పిన్న వయస్కుడైన స్పిన్నర్‌గా నిలిచాడు.

క 113 టెస్టు మ్యాచ్‌ల్లో 362 వికెట్లు పడగొట్టాడు, అప్పట్లో ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా ప్రపంచ రికార్డు. ఆ తర్వాత ఈ రికార్డును శ్రీలంక వెటరన్ రంగనా హెరాత్ (433) బద్దలు కొట్టాడు. అలాగే 6 సెంచరీల సాయంతో టెస్టుల్లో 4531 పరుగులు చేశాడు డానియల్. అలాగే 295 వన్డేల్లో 305 వికెట్లు, 2253 పరుగులు చేసి న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు.





























