AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పాకిస్తాన్‌కు మెంటలెక్కిస్తోన్న వీడియో.. ట్రోఫీ లెస్ సెలబ్రేషన్స్‌తో హీట్ పుట్టించారుగా..

Without Asia Cup Trophy Celebrations Video: టీమిండియా టీ20ఐ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ట్రోఫీని అందుకోకుండానే, రోహిత్ శర్మ గతంలో ట్రోఫీతో చేసిన ఐకానిక్ సెలబ్రేషన్‌ను అనుకరించడం ఈ దృశ్యాలకు మరింత హైప్ తెచ్చింది. ఈక్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసిన అర్షదీప్, హర్షిత్ రాణా కూడా ట్రోఫీ లెస్ సెలబ్రేషన్స్‌తో పాక్ జట్టుకు ఆట పట్టించారు.

Video: పాకిస్తాన్‌కు మెంటలెక్కిస్తోన్న వీడియో.. ట్రోఫీ లెస్ సెలబ్రేషన్స్‌తో హీట్ పుట్టించారుగా..
Ind Vs Pak Viral Video
Venkata Chari
|

Updated on: Sep 29, 2025 | 5:11 PM

Share

Hardik Pandya, Arshdeep Singh and Harshit Rana: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని సాధించి భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే, ఈ చారిత్రక విజయం తర్వాత ట్రోఫీ ప్రెజెంటేషన్ వేడుకకు సంబంధించి జరిగిన వివాదం, ఆపై భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

విజయోత్సవంలో వింత పరిణామం..

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి కప్ గెలుచుకుంది. దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వేళ, గెలిచిన జట్టుగా టీమ్ ఇండియా పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్ వేడుకకు హాజరు కాలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధిపతి అయిన మొహ్సిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత్ నిరాకరించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ పరిస్థితులు, టోర్నమెంట్ అంతటా జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనల నేపథ్యంలో టీమిండియా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

ట్రోఫీ లేకుండానే సంబురాలు..

ప్రెజెంటేషన్ వేడుకను బహిష్కరించినప్పటికీ, భారత ఆటగాళ్లు తమ విజయాన్ని గ్రౌండ్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంబరంలో హైలైట్‌గా నిలిచిన విషయం ఏమిటంటే, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా కలిసి ట్రోఫీ లేకుండానే ఫోటోషూట్‌లో పాల్గొన్నారు.

హార్దిక్ పాండ్యా, గాయం కారణంగా ఫైనల్‌కు దూరమైనప్పటికీ, డగౌట్‌లో ఉండి జట్టును ఉత్సాహపరిచాడు. ట్రోఫీని పట్టుకోవడానికి బదులు, అతను ఊహాత్మక ట్రోఫీని పట్టుకున్నట్లుగా ఫోజులిచ్చాడు.

అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా అతనితో పాటు ట్రోఫీ లేని స్థితిలో నిలబడి, గాలిలో ఏదో పట్టుకున్నట్లుగా, లేదంటే చేతులు కలిపి ఉంచినట్లుగా సరదాగా ఫోటోషూట్‌లో పాల్గొన్నారు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ట్రోఫీని అందుకోకుండానే, రోహిత్ శర్మ గతంలో ట్రోఫీతో చేసిన ఐకానిక్ సెలబ్రేషన్‌ను అనుకరించడం ఈ దృశ్యాలకు మరింత హైప్ తెచ్చింది.

సందేశం స్పష్టంగానే..

ట్రోఫీ లేకుండా భారత ఆటగాళ్లు చేసిన ఈ ఫోటోషూట్, ట్రోఫీని అందుకోకపోయినా తమ విజయం స్పష్టంగా కనిపిస్తోందని, రాజకీయాలు, వివాదాల కంటే మైదానంలో తమ ప్రదర్శనే ముఖ్యమని వారు చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. ఈ అపూర్వమైన సంఘటన భారత అభిమానుల దృష్టిని ఆకర్షించింది, సోషల్ మీడియాలో ఈ ‘ట్రోఫీ లేని’ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆటగాళ్ల నిర్ణయానికి మద్దతుగా, అభిమానులు కూడా ‘నో ట్రోఫీ, నో ప్రాబ్లమ్’ అంటూ సెలబ్రేషన్స్‌ను కొనసాగించారు.

ఏది ఏమైనా, ఆసియా కప్ ఫైనల్లో ట్రోఫీని బహిష్కరించడం అనేది క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన సంఘటనగా నిలిచిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..