Virat Kohli T20I Retirement: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కింగ్ కోహ్లీ.. ఇకపై టీ20ఐలు ఆడనంటూ బాంబ్ పేల్చిన రన్ మెషీన్

Virat Kohli T20I Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న అనంతరం మాట్లాడిన కోహ్లి తన రిటైర్మెంట్ గురించి అధికారిక ప్రకటన చేశాడు.

Virat Kohli T20I Retirement: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కింగ్ కోహ్లీ.. ఇకపై టీ20ఐలు ఆడనంటూ బాంబ్ పేల్చిన రన్ మెషీన్
Virat Kohli T20i Retirement
Follow us

|

Updated on: Jun 30, 2024 | 7:16 AM

Virat Kohli T20I Retirement: టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ రెండోసారి గెలుచుకుంది. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువుకు తెరదించింది. గతంలో 2013లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అదే సమయంలో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. అయితే విజయం సాధించిన ఆనందంలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న అనంతరం మాట్లాడిన కోహ్లి తన రిటైర్మెంట్ గురించి అధికారిక ప్రకటన చేసి, ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు.

ఈ ఎడిషన్ మొత్తం నిశ్శబ్దంగానే కోహ్లీ బ్యాట్.. ఫైనల్లో మాత్రం సూపర్బ్ ఇన్నింగ్స్..

ఈ ఎడిషన్ మొత్తం కోహ్లి బ్యాట్ నిశ్శబ్దానికే పరిమితమైంది. దీంతో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కానీ కోహ్లిపై నమ్మకం ఉంచిన కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్.. కోహ్లీకి వరుస అవకాశాలు ఇచ్చారు. తదనుగుణంగా ఫైనల్ మ్యాచ్‌కు ముందు కోహ్లీపై విశ్వాసం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ, ద్రవిడ్.. దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ కచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అన్నారు. దీని ప్రకారం నిర్ణయాత్మక మ్యాచ్‌లో 76 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.

టీ20 ఫార్మాట్‌కు కోహ్లీ వీడ్కోలు..

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడిన కోహ్లి.. తన అభిమానులను బాధించే ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. ‘ఇది నా చివరి టీ20 ప్రపంచకప్, దీన్ని విజయంతో ముగించాలనుకుంటున్నాను అంటూ తేల్చేశాడు. ఇది తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అని కోహ్లీ ధృవీకరించాడు.

ఇది తన చివరి టీ20 ప్రపంచకప్ అని అందరికీ తెలిసిందేనని కోహ్లీ తెలిపాడు. ఇప్పుడు జట్టును నడిపించే బాధ్యత యువ తరంపై ఉందని కోహ్లీ అన్నాడు. ఈ విజయానికి దేవుడికి కృతజ్ఞతలు తెలిపిన కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మను కొనియాడుతూ, ఇది తనకు 9వ టీ20 ప్రపంచకప్ అని, దానికి అతను అర్హుడని చెప్పుకొచ్చాడు.

కోహ్లీ టీ20 కెరీర్..

ఇది కోహ్లీకి చివరి మ్యాచ్ అయినప్పటికీ, అతను తన T20 అంతర్జాతీయ కెరీర్‌ను అనేక రికార్డులతో ముగించాడు. కోహ్లి 12 జూన్ 2010న టీం ఇండియా తరపున తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన చివరి మ్యాచ్‌ ఆడిన కోహ్లి, ఇప్పటి వరకు 125 టీ20 మ్యాచ్‌లు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. కోహ్లీ తన టీ20 కెరీర్‌లో 1 సెంచరీ, 38 అర్ధసెంచరీలు సాధించాడు. ఇది మాత్రమే కాదు, టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 1292 పరుగులు చేయడం ద్వారా కోహ్లి తన ప్రయాణాన్ని ముగించాడు. అతని పేరు మీద 15 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే