Video: ఆనాడు శ్రీశాంత్.. నేడు సూర్య.. మ్యాచ్‌లను మలుపు తిప్పిన థ్రిల్లింగ్ క్యాచ్‌లను చూశారా..

T20 World Cup 2024 Suryakumar Yadav: తొమ్మిదో ఎడిషన్ T20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) ఫైనల్ మ్యాచ్ భారత్ vs సౌతాఫ్రికా (IND vs SA) మధ్య జరిగింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ డేవిడ్ మిల్లర్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పి, రోహిత్ సేన ట్రోఫిని గెలిచేందుకు కీలకంగా పనిచేసింది.

Video: ఆనాడు శ్రీశాంత్.. నేడు సూర్య.. మ్యాచ్‌లను మలుపు తిప్పిన థ్రిల్లింగ్ క్యాచ్‌లను చూశారా..
Sreesanth Suryakumar Yadav Catch Video
Follow us

|

Updated on: Jun 30, 2024 | 6:45 AM

Suryakumar Yadav Catch: ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. గత నెల రోజులుగా టైటిల్ ఛేజింగ్‌లో ఉన్న టీమిండియా.. ఎట్టకేలకు ట్రోఫీపై తన పేరును లిఖించుకుంది. దీంతో 17 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువుకు టీమిండియా తెరదించింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల సవాల్ విసిరింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు చివరి 5 ఓవర్ల వరకు ఫేవరెట్‌గా నిలిచింది. కానీ తుఫాన్ బ్యాటింగ్‌తో భారత్‌ను భయపెట్టిన హెన్రిచ్ క్లాసెన్‌ను పెవిలియన్ చేర్చడం ద్వారా హార్దిక్ పాండ్యా ఆటను మలుపు తిప్పాడు. అంతేకాదు ఆఖరి ఓవర్ తొలి బంతికే డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్‌ను సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌గా మలిచి మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మలిచాడు. దీంతో 2007లో పాకిస్తాన్‌పై శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌ను తలపించిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీశాంత్ పట్టిన క్యాచ్ ట్రోఫిని అందిచగా.. సూర్య కుమార్ పట్టిన క్యాచ్‌తో మరోసారి ట్రోఫిని దక్కించుకునేలా చేసింది.

సూర్య అద్భుతమైన క్యాచ్.. శ్రీశాంత్‌ను గుర్తు చేసిన మిస్టర్ 360 ప్లేయర్..

వాస్తవానికి దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ మిల్లర్ తొలి బంతికే భారీ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బౌండరీలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి పొరపాటు చేయకుండా అద్భుత క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ పట్టడంలో సూర్యకుమార్ యాదవ్ చిన్న పొరపాటు చేసి ఉంటే ప్రపంచకప్ కల చెదిరిపోయేది. తొలి బంతికే హార్దిక్ పాండ్యా వైడ్ ఫుల్ టాస్ వేశాడు. డేవిడ్ మిల్లర్ దానిని సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. బంతి మిల్లర్ బ్యాట్‌కు తగిలి ఆకాశంలోకి దూసుకెళ్లింది. అంతా సిక్స్‌ అవుతుందని భావించారు. కానీ, సూర్య బౌండరీ లోపల బంతిని క్యాచ్ చేశాడు. అతను బౌండరీ దాటకముందే, బంతిని లోపలికి విసిరి మళ్లీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ కారణంగా మ్యాచ్ మొత్తం భారత్‌కు అనుకూలంగా మారింది.

భారత్ 7 పరుగుల తేడాతో విజయం..

డేవిడ్ మిల్లర్ ఔటైన తర్వాత దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది. ఈ వికెట్ తర్వాత, ఆఫ్రికన్ జట్టులోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా 5 బంతుల్లో 16 పరుగులు చేయలేకపోయారు. తద్వారా చివరిగా దక్షిణాఫ్రికా చోకర్స్ టైటిల్‌ను నిలుపుకుంది. ఆఖర్లో రబడ తొలి బంతికే బౌండరీ బాది మ్యాచ్‌ను మళ్లీ ఉత్కంఠభరితంగా మార్చాడు. అయినప్పటికీ, పాండ్యా తన ధాటిని కొనసాగించి 7 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకోగలిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..
పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే..