Video: ఈ ఊచకోతకు ఏం పేరు పెట్టాలయ్యా.. 12 ఫోర్లు, 3 సిక్సర్లు.. 58 బంతుల్లో రోహిత్ ఫ్రెండ్ బీభత్సం
Surrey vs Sussex: టీ20 బ్లాస్ట్ 2025లో సర్రే వర్సెస్ సస్సెక్స్ మధ్య ఒక ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సర్రేకు చెందిన విల్ జాక్స్ 59 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేసి తన జట్టును విజయపథంలో నడిపించాడు.

Will Jacks Century: వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2025 లో సర్రే (Surrey) వర్సెస్ ససెక్స్ (Sussex) మధ్య జరిగిన మ్యాచ్‌లో సర్రే బ్యాటర్ విల్ జాక్స్ (Will Jacks) మెరుపు శతకంతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టి తన ఆల్ రౌండర్ ప్రతిభను ప్రదర్శించాడు. అతని అద్భుతమైన ప్రదర్శనతో సర్రే జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించి, సౌత్ గ్రూప్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ఎడ్జ్ బాస్టన్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో, సర్రే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విల్ జాక్స్ ఆరంభం నుంచే ససెక్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు సాధించి, తన టీ20 కెరీర్‌లో ఐదో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అతనితో పాటు జాసన్ రాయ్ 35 పరుగులు, ర్యాన్ పటేల్ 30 పరుగులు చేయడంతో సరే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరును సాధించింది.
అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ససెక్స్‌కు ఓపెనర్లు డేనియల్ హ్యూస్ (75 పరుగులు), టామ్ క్లార్క్ (41 పరుగులు) శుభారంభం అందించారు. అయితే, మిడిల్ ఓవర్లలో సరే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ససెక్స్ రన్ రేట్ తగ్గింది. కీలక సమయంలో విల్ జాక్స్ బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి ససెక్స్‌ను దెబ్బతీశాడు. సామ్ కరణ్ కూడా 4 వికెట్లతో అదరగొట్టాడు. చివరి వరకు పోరాడినప్పటికీ, ససెక్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Will Jacks just smashed a century (100 off 59) and grabbed 2/27 in the T20 Blast! What a game! 💥🔥pic.twitter.com/3mqUk1QEHN#willjacks #t20blast #cricketupdates #Cricket #England
— CricInformer (@CricInformer) July 19, 2025
ఈ విజయం సర్రే జట్టుకు చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌తో సర్రే ఇప్పుడు Vitality Blast 2025లో 504 పరుగులతో 50.40 సగటు, 164.70 స్ట్రైక్ రేట్‌తో అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, అతని చివరి ఐదు మ్యాచ్‌లలో స్కోర్లు 100, 52, 57, 31, 57 గా నమోదు కావడం అతని అద్భుతమైన ఫామ్‌కు నిదర్శనం.
విల్ జాక్స్ ఈ సీజన్‌లో ప్రదర్శిస్తున్న ఈ ఆల్ రౌండర్ ప్రదర్శన, రాబోయే IPL 2026 వేలంలో అతనికి మంచి ధర పలకడానికి దోహదపడుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్రే జట్టు ఈ విజయం ద్వారా సౌత్ గ్రూప్‌లో 11 విజయాలు, కేవలం 3 ఓటములతో అగ్రస్థానానికి చేరుకొని నాకౌట్ దశకు చేరుకుంది. విల్ జాక్స్ ప్రదర్శన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








