Team India Captain: టీమిండియా కెప్టెన్‌గా తెరమీదకు కొత్త పేరు..ఇప్పటివరకూ చర్చలలో లేని ఆటగాడు..
ప్రస్తుత భారత జట్టు సారధి తర్వాత ఆ బాధ్యతలను ఎవరు చేపడతారనే విషయం తెలుసుకునేందుకు విదేశీ జట్లు కూడా ఉత్సుకతను ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టు పగ్గాలు రోహిత్ శర్మ.. మరి ఆ తర్వాత..?
ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు స్థానం చాలా ప్రముఖంగా ఉంటుంది. భారత్ మ్యాచ్ ఆడుతోందన్నా.. లేక భారత్‌తో సిరీస్ అన్నా కాసుల వర్షమే అని భావిస్తాయి క్రికెట్ దేశాలు. ఇకపోతే ప్రస్తుత భారత జట్టు సారధి తర్వాత ఆ బాధ్యతలను ఎవరు చేపడతారనే విషయం తెలుసుకునేందుకు విదేశీ జట్లు కూడా ఉత్సుకతను ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టు పగ్గాలు రోహిత్ శర్మ చేతుల్లోనే ఉన్నాయి. అయితే వన్డేలకు రోహిత్ తర్వాత ఎవరు కెప్టెన్ అవుతారు..? ఇదే ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ప్రతిపాదన ప్రకారం మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నుంచి భారత జట్టు వన్డే పగ్గాలు చేపట్టిన వారంతా 183 పరుగుల మార్క్‌కు చేరినవారే. గంగూలీ(183) తర్వాత ధోనీ(183), కోహ్లీ(183).. ఇప్పటి కెప్టెన్ (183+ ; అత్యధికంగా 264) చేశారు. అదే క్రమంలో ఈ రోజు(శనివారం) బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 210 పరుగులు చేసి.. డబుల్ సెంచరీ సాధించిన ఏడో అంతర్జాతీయ ఆడగాడిగా.. నాలుగో భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
అయితే గంగూలీ నుంచి రోహిత్ వరకూ, ఆ తర్వాత ఇషాన్ మినహా మరెవరు 183 పరుగుల మార్కును తాకలేదు. తాజాగా ఇషాన్ ఈ మార్కును తాకడంతో అతడే భారత జట్టుకు తర్వాతి కెప్టెన్ అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. శనివారం ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో, చివరి మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరును చేసింది. భారత్ ఈ స్కోరు చేయడంలో ఇషాన్ చసిన 210 పరుగులు చాలా కీలకమైనవిగా చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు చెబుతోన్న గణాంకాలను అనుసరించి ఇషాన్‌ను తదుపరి భారత కెప్టెన్‌గా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో 8 బంతుల్లో కేవలం మూడు పరుగులకే శిఖర్ ధావన్‌ను కోల్పోయింది. ఇషాన్ తర్వాత వచ్చిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి భారత్‌ను ముందుకు నడిపించడమే కాక రెండో వికెట్‌కు 290 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Captain with their highest score in the past
Ganguly-183 Dhoni-183 Kohli-183 Rohit-183+ Ishan-183+…future captain??#ishankishan #BANvIND
— AB_Hi (@abhi_inthearc) December 10, 2022
ఇషాన్ 131 బంతుల్లో 24 బౌండరీలు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేసి టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసకు చేరాడు. ఇంకా వన్డే ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన ఆటగాడిగా ఇషాన్ నిలిచి, క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇషాన్ మాట్లాడుతూ ‘‘విరాట్ భాయ్‌కి ఆటపై అంత మంచి అవగాహన ఉంది. నేను నా 90 పరుగులలో ఉన్నప్పుడు అతను నన్ను ప్రోత్సాహించాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒత్తిడికి లోనవకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను’’ తెలిపాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..