Rishabh Pant: ఐపీఎల్ 2023 లో రిషభ్ పంత్ ఆటపై కీలక అప్‌డేట్.. ఢిల్లీ డైరెక్టర్ గంగూలీ ఏమన్నారంటే..
డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన పంత్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉన్నప్పటికీ.. అతను కొంత కాలం ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ కాపిటల్స్ టీమ్ డైరెక్టర్ అయిన సౌరవ్ గంగూలీ.. ఆ జట్టు కెప్టెన్సీ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు..
టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మొదట డెహ్రాడూన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్ ప్రస్తుతం ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పుడు పంత్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ కొంత కాలం ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ కాపిటల్స్ టీమ్ కొత్త డైరెక్టర్ సౌరవ్ గంగూలీ.. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం జరగనున్న ఐపీఎల్ 2023 16వ ఎడిషన్‌ను రిషభ్ కోల్పోనున్నాడని ధృవీకరించినట్లు తెలుస్తోంది.
నేషనల్ మీడియా కథనాలు ప్రకారం ‘రిషబ్ పంత్ ఐపీఎల్(16వ ఎడిషన్)కు అందుబాటులో ఉండడు. నేను ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉన్నాను. ఢిల్లీ కాపిటల్స్ గొప్ప ఐపీఎల్ టీమ్. మేము ఈ ఏడాది బాగా రాణిస్తాము. కానీ రిషబ్ పంత్ గాయాలు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రభావం చూపుతాయి’ అని గంగూలీ కోల్‌కతా విలేకరులతో అన్నారు.
గతేడాది అక్టోబర్‌కు ముందు వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ, 2019 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో సలహాదారుగా భాగమయ్యాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత అక్టోబర్‌లో రోజర్ బిన్నీ ఆ బాధ్యతలు చేపట్టారు.
కాగా, 2021 ఐపీఎల్ ఎడిషన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన రిషభ్ పంత్.. సీజన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిపాడు. అంతేకాక రిషభ్ పంత్ తన తొలి ప్రదర్శన చేసినప్పటి నుంచి అంటే 2016 నుంచి కూడా ఢిల్లీ జట్టులోనే కొనసాగుతున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..