భారత్, శీలంక మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక జట్టు 160 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 2 పరుగుల తేడాతో ఉత్కంఠ భరితమైన విజయం అందుకుని కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది.