ICC Rankings: కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించిన కోహ్లీ, రోహిత్.. మరింత మెరుగవుతున్న ర్యాంకింగ్స్
ICC Rankings: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 2023లో తమ తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా, శ్రీలంకపై టీమ్ ఇండియా విజయం సాధించడంలో..
ICC Rankings: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 2023లో తమ తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా, శ్రీలంకపై టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. జనవరి 10వ తేదీ మంగళవారం గౌహతిలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 113 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. దీంతో పాటు భారత్‌లో సెంచరీ కోసం కోహ్లీ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. వన్డేల్లో కోహ్లీ కెరీర్‌లో ఇది 45వ సెంచరీ కాగా.. ఈసెంచరీతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ కోహ్లి దూసుకెళ్లాడు. కోహ్లి ఇప్పుడు రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిది నుంచి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కోహ్లీ మాత్రమే కాదు, కెప్టెన్ రోహిత్ శర్మ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సెంచరీ చేయలేకపోయిన 81 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
అదే సమయంలో బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ సత్తా చూటి 2 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ ఇప్పుడు 18వ స్థానానికి ఎగబాకాడు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో తొలి వన్డేలో కెప్టెన్, మాజీ కెప్టెన్ తమ సత్తా చాటి.. ఇంకా తాము మెరుగైన ఇన్నింగ్స్ ఆడగలమని నిరూపించారు. త్వరలో జరగనున్న ఐపిఎల్ మ్యాచులకు ముందు అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో వారి ఆటపై అంచనాలు అమాంతం పెరిగినట్లైంది. గతంలో విరాట్ కోహ్లీ తన ఫామ్ పై ఎన్నో విమర్శఎదుర్కొన్నాడు. అయితే తాజాగా గత కొద్ది కాలంగా విరాట్ అద్భుతమైన ఆటతీరును అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..