టీమిండియా నుంచి ఔట్.. కట్ చేస్తే.. 49 ఫోర్లు, 4 సిక్సర్లతో 379 పరుగులు బాదేశాడు.. ఎవరంటే!
టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీలో రెచ్చిపోయాడు. అస్సాంతో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న షా..
టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీలో రెచ్చిపోయాడు. అస్సాంతో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న షా 379 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌండరీలతో అస్సాం బౌలర్లను దంచికొడుతున్నాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పృథ్వీ షాకు ఇదే అత్యుత్తమ స్కోర్. అలాగే షా తన ట్రిపుల్ సెంచరీని 326 బంతుల్లో పూర్తి చేశాడు.
ముంబై ఓపెనర్‌గా దిగిన షా.. మొత్తం 383 బంతులు ఎదుర్కుని 49 ఫోర్లు, 4 సిక్సర్లతో 379 పరుగులు చేశాడు. ఒకదశలో కచ్చితంగా 400 పరుగులు చేస్తాడనుకున్న సమయంలో రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ తొలిరోజు పృథ్వీ షా 240 పరుగులతో అజేయంగా నిలవగా.. రెండో రోజు రెండో సెషన్ మొదట్లోనే షా తన ట్రిపుల్ హండ్రడ్ కంప్లీట్ చేశాడు. పృథ్వీ షా అద్భుత బ్యాటింగ్‌తో అటు ముంబై 3 వికెట్లకు 598 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోర్ సాధించడం పక్కా.