AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మకు చోటు.. తొలి మ్యాచ్‌లో స్పెషల్ ఎంట్రీ..

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026కు రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని జైషా ప్రకటించారు. భారత క్రికెట్ దిగ్గజం 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలకు కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Rohit Sharma: గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మకు చోటు.. తొలి మ్యాచ్‌లో స్పెషల్ ఎంట్రీ..
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Nov 25, 2025 | 7:39 PM

Share

Rohit Sharma: భారతదేశంతోపాటు శ్రీలంకలో జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్‌నకు టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.

బుధవారం కోల్‌కతాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకటన కార్యక్రమంలో ఐసీసీ చైర్‌పర్సన్ జై షా ఈ ప్రకటన చేశారు.

2024లో రోహిత్ భారత్‌కు టీ20 ప్రపంచ కప్‌ను అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతను ఈ పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

38 ఏళ్ల రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2027లో వన్డే ప్రపంచ కప్‌ను తన గౌరవ జాబితాలో చేర్చాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

8 వేదికలలో మ్యాచ్‌లు..

2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఎనిమిది వేదికలలో జరగనున్నాయి. ఐదు భారతదేశం నుంచి, మూడు శ్రీలంక నుంచి ఎంచుకున్నారు. ఈ మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొలంబోలోని ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కాండీలలో జరుగుతాయి.

టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు..

2026 T20 ప్రపంచ కప్‌లో ఇరవై జట్లు పాల్గొంటాయి. ఐదు జట్లు ఉన్న నాలుగు గ్రూపులు లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి.

గ్రూప్ వన్‌: భారతదేశం, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్.

గ్రూప్ టూ: బంగ్లాదేశ్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్.

గ్రూప్ త్రీ: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే.

గ్రూప్ నాలుగు: ఆఫ్ఘనిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ.

2026 టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఇదే..

ఇండియా vs. USA, ఫిబ్రవరి 7, ముంబై

ఇండియా vs నమీబియా, ఫిబ్రవరి 12, ఢిల్లీ

ఫిబ్రవరి 15, కొలంబో, భారత్ vs. పాకిస్తాన్

ఫిబ్రవరి 18, అహ్మదాబాద్, ఇండియా vs నెదర్లాండ్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!