AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

Shreyas Iyer : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలిచినా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. గెలిచామన్న ఆనందంలో ఉన్న అయ్యర్ ముఖం, ఈ చేదు వార్త వినగానే ఒక్కసారిగా మారిపోయింది.

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు
Shreyas Iyer
Rakesh
|

Updated on: Apr 01, 2026 | 12:15 PM

Share

Shreyas Iyer : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జట్టు బోణి కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే, ఈ గెలుపు తెచ్చిన సంతోషం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‎కి ఎక్కువ సేపు నిలవలేదు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఐపీఎల్ యాజమాన్యం ఆయనకు భారీ జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది. గెలిచామన్న ఆనందంలో ఉన్న అయ్యర్ ముఖం, ఈ చేదు వార్త వినగానే ఒక్కసారిగా మారిపోయింది.

అసలు జరిమానా ఎందుకు పడింది?

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత సమయంలోగా తమ ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు ప్రతి ఓవర్‌ను నిర్ణీత టైమ్ ఫ్రేమ్‌లో పూర్తి చేయాలి. కానీ ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇలాంటి తప్పు చేసిన మొదటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కావడంతో, ఐపీఎల్ యాజమాన్యం ఆయనకు రూ.12 లక్షల జరిమానా విధించింది. ఇది జట్టు చేసిన మొదటి తప్పు కాబట్టి కేవలం కెప్టెన్‌కు మాత్రమే ఫైన్ వేశారు, అదే రెండోసారి రిపీట్ అయితే జట్టు సభ్యులకు కూడా కోత తప్పదు.

అయ్యర్‌కు ఇదో బ్యాడ్ డే

వ్యక్తిగతంగా చూస్తే శ్రేయస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్ పెద్దగా కలిసిరాలేదు. తొలుత ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చెయ్యి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు తన టీమ్ మేట్ కూపర్ కానోలీ కొట్టిన షాట్ నేరుగా అయ్యర్ చేతికి తగలడంతో నొప్పితో విలవిలలాడాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడుతూ కేవలం 11 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మ్యాచ్ గెలిచాం కదా అని ఊపిరి పీల్చుకునే లోపే, ఇప్పుడు ఏకంగా 12 లక్షల రూపాయల జరిమానా పడటంతో అయ్యర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.

జరిమానా పక్కన పెడితే, పంజాబ్ విజయంలో ఇద్దరు ఆటగాళ్లు హీరోలుగా నిలిచారు. అరంగేట్రం మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా బ్యాటర్ కూపర్ కానోలీ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. అంతకుముందు బౌలింగ్‌లో విజయ్ కుమార్ వైశాక్ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. వైశాక్ ప్రదర్శనపై కెప్టెన్ అయ్యర్ కూడా ప్రశంసలు కురిపించాడు. అతడిని బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని కొనియాడాడు. గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసి 162 పరుగులు చేయగా, పంజాబ్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..