Video: ‘సంగీత సింఫొనీ – కవర్ డ్రైవ్’ జోడీ అదుర్స్.. లేడీ కోహ్లీ పెళ్లికి లేఖ పంపిన ప్రధాని మోడీ..!
Smriti Mandhana and Palash Muchhal Wedding: స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి టీమిండియా ఆటగాళ్లు కూడా వెళ్లారు. ఇప్పటికే వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి.

Smriti Mandhana and Palash Muchhal Wedding: టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్-కెప్టెన్ స్మృతి మంధాన కొత్త జీవితంలోకి ఎంటరవ్వనుంది. భారత జట్టు తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించిన మంధాన, ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ నవంబర్ 23న వివాహం చేసుకోనున్నారు. వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మంధాన సహచరులు సాంగ్లిలోని ఆమె ఇంటికి చేరుకుని వివాహ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్మృతి, పలాష్‌లకు వారి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేక లేఖ రాశారు.
స్మృతి-పలాష్ కోసం ప్రత్యేక లేఖ రాసిన ప్రధానమంత్రి..
ఇటీవలి ప్రపంచ కప్ విజయం తర్వాత, టీం ఇండియా న్యూఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ నివాసంలో ఆయనను కలిసింది. ఆ సమయంలో మంధాన కూడా జట్టుతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ స్టార్ ప్లేయర్ జీవితంలో కొత్త మైలురాయిని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి ఆమెను అభినందించారు. స్మృతి, పలాష్ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ వారికి ప్రత్యేక లేఖ రాశారు.
కవర్ డ్రైవ్, సంగీత సింఫొనీ కలిసిన వేళ..
ఈ ప్రత్యేక సందర్భంగా ప్రధాని రెండు కుటుంబాలను కూడా అభినందించారు. అంతేకాకుండా, మంధాన క్రికెట్ కెరీర్‌ను, పలాష్ సంగీతాన్ని కూడా మోడీ ప్రశంసించారు. “ఈ కొత్త, అందమైన జీవితాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, స్మృతి కవర్ డ్రైవ్ సొగసు, పలాష్ మనోహరమైన సంగీత సింఫొనీ ఒక అద్భుతమైన భాగస్వామ్యంగా కలుస్తుంది” అని ప్రధాని భావోద్వేగంతో ప్రస్తావించారు.
వేడుకలు ప్రారంభం..
View this post on Instagram
ఇంతలో, ప్రపంచ ఛాంపియన్ భారత జట్టు నుంచి స్మృతి ఇతర సహచరులు కూడా ఆమె వివాహానికి హాజరు కావడానికి వచ్చారు. స్మృతి సన్నిహితురాలు జెమీమా రోడ్రిగ్జ్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో దీని గురించి ఓ వీడియోను పంచుకుంది. సంజయ్ దత్, అర్షద్ వార్సీ చిత్రం “లగే రహో మున్నాభాయ్” లోని “సమ్ఝో హో హి గయా…” పాటకు స్మృతి, జెమీమా, శ్రేయంకా పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




