IPL 2026: ‘బిగ్ హిట్టర్’తో పాటు ముగ్గురు.. బుర్ర బద్దలయ్యే ప్లాన్‌తో వేలంలోకి చెన్నై..
Chennai Super Kings: ఐపీఎల్ 2026 సీజన్ కోసం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న మినీ వేలానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన భారీ మార్పుల్లో భాగంగా స్టార్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసి, సంజూ శాంసన్‌ను జట్టులోకి తెచ్చుకుంది.

Chennai Super Kings: ఐపీఎల్ 2026 సీజన్ కోసం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న మినీ వేలానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన భారీ మార్పుల్లో భాగంగా స్టార్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసి, సంజూ శాంసన్‌ను జట్టులోకి తెచ్చుకుంది. అలాగే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, ప్రస్తుతం రూ. 43.4 కోట్ల భారీ పర్స్‌తో వేలానికి వెళ్తోంది.
ఈ నేపథ్యంలో జట్టులో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి సీఎస్‌కే ప్రధానంగా ఈ నలుగురు ఆటగాళ్లపై గురిపెట్టినట్లు సమాచారం..
1. ఆండ్రీ రస్సెల్ (Andre Russell): కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విడిచిపెట్టిన విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్‌ను దక్కించుకోవడానికి సీఎస్‌కే ఆసక్తి చూపుతోంది. సామ్ కరన్ స్థానంలో లోయర్ ఆర్డర్ హిట్టర్‌గా, డెత్ ఓవర్ల బౌలర్‌గా రస్సెల్ ఉపయోగపడతాడు. సీఎస్‌కే స్కౌట్ ఏఆర్ శ్రీకాంత్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా దీనికి బలం చేకూరుస్తోంది. ఒకవేళ రస్సెల్ దొరకకపోతే కామెరూన్ గ్రీన్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.
2. రవి బిష్ణోయ్ లేదా రాహుల్ చాహర్: స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్‌కు జతగా మరో నాణ్యమైన స్పిన్నర్ కోసం సీఎస్‌కే చూస్తోంది. రవి బిష్ణోయ్ లేదా రాహుల్ చాహర్‌లలో ఒకరిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చెపాక్ స్పిన్ పిచ్‌లకు రాహుల్ చాహర్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని అంచనా.
3. గెరాల్డ్ కోయిట్జీ (Gerald Coetzee): శ్రీలంక పేసర్ మతీషా పతిరణ స్థానాన్ని భర్తీ చేయడానికి దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయిట్జీని టార్గెట్ చేయవచ్చు. అతనికి బ్యాకప్‌గా లుంగి ఎంగిడి, మోహిత్ శర్మ లేదా ఆకాశ్ దీప్‌లను పరిశీలిస్తున్నారు. పతిరణను తిరిగి దక్కించుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు.
4. ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis): ఓపెనింగ్ స్థానంలో అనుభవజ్ఞుడైన విదేశీ బ్యాటర్ కోసం సీఎస్‌కే ప్రయత్నిస్తోంది. గతంలో సీఎస్‌కేకి ఎన్నో విజయాలు అందించిన ఫాఫ్ డు ప్లెసిస్ లేదా క్వింటన్ డి కాక్‌లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది.
జట్టు వివరాలు:
సీఎస్‌కే రిలీజ్ లిస్ట్: రాహుల్ త్రిపాఠి, కమలేష్ నాగర్‌కోటి, వాన్ష్ బేడీ, ఆండ్రూ సిద్దార్థ్, విజయ్ శంకర్, రచిన్ రవీంద్ర, సామ్ కరణ్(ట్రేడ్ ఔట్), దీపక్ హుడా, మతీష పతీరణ, షేక్ రషీద్, రవీంద్ర జడేజా(ట్రేడ్ ఔట్), రవిచంద్రన్ అశ్విన్(రిటైర్మెంట్)
సీఎస్‌కే రిటైన్ లిస్ట్: సంజూ శాంసన్(ట్రేడ్ ఇన్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, అన్షుల్ కంబోజ్, మహేంద్ర సింగ్ ధోనీ, శ్రేయస్ గోపాల్, ఉర్విల్ పటేల్, డేవాన్ కాన్వే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ముఖేష్ చౌదరి.
చెన్నై పర్స్ వాల్యూ: రూ. 43.4 కోట్లు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




