IPL 2026: ఐపీఎల్ 2026 వేలం ముహూర్తం ఫిక్స్..
క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది! ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో జరగనుంది. 173 మంది ఆటగాళ్లను ఇప్పటికే రిటైన్ చేసుకున్నారు. 77 స్లాట్‌లు మిగిలి ఉన్నాయి. మొత్తం రూ.237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. కేకేఆర్ భారీ పర్స్‌తో ఉండగా, ముంబై ఇండియన్స్ అతి తక్కువ నిధులతో వేలంలోకి వెళ్తోంది.
క్రికెట్ ప్రేమికులకు పండగలాంటి వార్త ఇది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. రాబోయే ఐపీఎల్ 2026 కోసం మినీ వేలం వచ్చే నెల జరగనుంది. దీనికి సంబంధించిన తేదీ, వేదిక వివరాలను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈసారి వేలాన్ని విదేశాల్లోని అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో డిసెంబర్ 16న నిర్వహించనున్నారు. మినీ వేలానికి ముందు 10 జట్లు కలిసి మొత్తం 173 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. వీరిలో 49 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఇంకా 77 స్లాట్‌లు మిగిలి ఉన్నాయి. అన్ని జట్ల పర్సులలో కలిపి మొత్తం రూ.237.55 కోట్ల డబ్బు వేలంలో అందుబాటులో ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. పంజాబ్ కింగ్స్ 21 మందిని, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ చెరో 20 మందిని ఇప్పటికే రిటైన్ చేసుకున్నాయి. ఫ్రాంచైజీల వద్ద మిగిలిన డబ్బు లెక్కల ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు ఉన్నాయి. వీరు ఏకంగా 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఆండ్రే రసెల్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఖరీదైన ఆటగాళ్లను కేకేఆర్ విడుదల చేయడం దీనికి కారణం. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్‌లో రూ.25.5 కోట్లు మిగిలాయి. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం అతి తక్కువ మొత్తంతో వేలానికి వెళ్తోంది. ఆ జట్టు వద్ద కేవలం రూ.2.75 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వేలం ద్వారా కేకేఆర్ తమ జట్టును దాదాపు కొత్తగా నిర్మించుకోవడానికి మంచి అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరె.. ముల్లు తీయడం ఇంత ఈజీనా.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియక.. కష్టపడ్డానే
ఐ బొమ్మ రవి.. లైఫ్ స్టైల్ ఇదే !! డబ్బు సంపాదన అంటే ఎందుకంత కసి ??
తనూజ మాస్టర్ ప్లాన్.. దివ్య, భరణికి చెక్ మేట్
TOP 9 ET News: మహేష్ 100 కోట్లు.. జక్కన్న 200 కోట్లు | ‘వారణాసి’ నుంచి సాంగ్ రిలీజ్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

