AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.20 కోట్ల ప్లేయర్‌పై కన్నేసిన కావ్యపాప

రూ.20 కోట్ల ప్లేయర్‌పై కన్నేసిన కావ్యపాప

Phani CH
|

Updated on: Nov 19, 2025 | 5:49 PM

Share

సన్ రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ కోసం గట్టిగా పోటీ పడనుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రత్యేకంగా కోరడంతో, కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకోవాలని SRH చూస్తోంది. ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి కోర్ టీమ్‌పై భరోసాతో ఉన్న SRH, ఆల్‌రౌండర్ రోల్ కోసం గ్రీన్‌ను టార్గెట్ చేసింది. KKR, CSK నుండి తీవ్ర పోటీ ఎదురుకానుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్.. మినీ వేలంలో పోటీకి సిద్ధమైంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోరుతున్న ఆ ప్లేయర్ కోసం గట్టిగా పోటీ పడనుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ కూడా తమ కోర్ టీంపై నమ్మకాన్ని ఉంచాయి. ముఖ్యంగా బెంచ్‌కే పరిమితమైన ప్లేయర్స్, నిలకడలేమి ఆటగాళ్లకు గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమయ్యాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే.. ట్రావిస్ హెడ్‌ను ముంబై టీంకు ట్రేడ్ చేసి.. రోహిత్ శర్మను తీసుకుంటుందని.. అలాగే హెన్రిచ్ క్లాసెన్‌ను వేలంలోకి వదిలేసి.. మళ్లీ కొనుగోలు చేస్తుందని టాక్ వినిపించింది. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ కావ్యపాప.. తన కోర్ టీంపై మళ్లీ భరోసాతో ముందుకు వెళ్తోంది. కావ్యా పాప కోర్ టీం విషయానికొస్తే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కచ్చితంగా మరోసారి ఓపెనింగ్ బ్యాటర్లుగా బరిలోకి దిగనున్నారు. అలాగే మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఉండకనే ఉన్నారు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, అనికేట్ దిగనుండగా.. వీరికంటే ముందు మరో ఆల్‌రౌండర్- కమ్ ఫినిషర్ రోల్ కోసం ఓ ప్లేయర్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి హైదరాబాద్ యాజమాన్యం ఆసక్తిగా చూస్తోంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అతడి కోసం కోట్లు అయినా ఖర్చు చేయాలని చెప్పాడట. అతడెవరో కాదు.. కామెరాన్ గ్రీన్. గాయం నుంచి కోలుకున్న ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్.. అటు వన్డేలు, ఇటు టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. అలాగే మరికొన్ని రోజుల్లో యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుండటంతో.. అందరి ఫోకస్ అతడిపైనే పడింది. ఇక్కడ కామెరాన్ గ్రీన్ కోసం హైదరాబాద్‌కు మినీ వేలంలో గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. అటు కేకేఆర్, చెన్నై కూడా ఈ ఆల్‌రౌండర్ కోసం పోటీ పడుతున్నాయి. మరి ఎవరికి దక్కుతాడో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో గొరిల్లా.. దెబ్బకు కోతులు పరార్

షూటింగ్‌లో జక్కన్న టార్చర్‌ తట్టుకోలేకపోయా

అప్పు తీర్చమని అడిగినందుకు ఎంత పని చేశావురా ??

మన ఇస్రోకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు.. వచ్చే ఏడాది భారీ టార్గెట్ !!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉరిశిక్ష