మన ఇస్రోకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు.. వచ్చే ఏడాది భారీ టార్గెట్ !!
ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాలలో దూసుకుపోతోంది. రాబోయే ఐదేళ్ళలో 60కి పైగా రాకెట్ ప్రయోగాలు చేపట్టనుంది, ఇందులో ఇతర దేశాల ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. చంద్రయాన్-4 ద్వారా చంద్రుడి నుంచి మట్టి నమూనాలు సేకరించి, గగన్‌యాన్ ద్వారా 2027లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రణాళికలున్నాయి. స్వంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలో మూడో దేశంగా నిలవనుంది. ఈ ప్రయోగాలు భారత అంతరిక్ష భవిష్యత్తుకు కీలకమైనవి.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది ఇస్రో. వరుస ప్రయోగాలతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఇస్రో చంద్రయాన్, గగన్‌యాన్ ప్రయోగాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో గగన్‌యాన్, చంద్రయాన్ మిషన్‌లతో పాటు మరికొన్ని రాకెట్లను ప్రయోగించబోతున్నట్లు ఇస్రో ప్రకటించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రాబోయో ఐదు సంవత్సరాల వ్యవధిలో కేవలం భారత్ ప్రయోజనాల కోసమే 60కి పైగా రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇతర దేశాలు సైతం తమ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రోకు క్యూ కడుతున్నాయి. నాలుగు నెలల్లో కీలక ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఇస్రో తెలిపింది. ముందుగా అమెరికాకు చెందిన ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. ప్రయోగాల పరంపలోనే ఈ ఏడాది డిసెంబర్ లో Lvm 03M6 రాకెట్ ప్రయోగంతో అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. అదేవిధంగా Pslv-C62 రాకెట్ ప్రయోగం ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఓషియన్ శాటిలైట్ 3A ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. తిరుపతి జిల్లా సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ లో రెండు రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు రాకెట్ అసెంబ్లింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక సంవత్సరంలో ఇస్రో మరో 7 ఏడు రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సిద్ధంగా ఉందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ వెల్లడించారు. అందులో భాగంగానే ఈ ఏడాది వార్షికంలో 5 Pslv రాకెట్ ప్రయోగాలు ఉంటాయని కూడా చైర్మన్ తెలిపారు. ఇస్రో కులశేఖర పట్నంలో లాంచ్ ప్యాడ్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా తిరుపతి జిల్లా శ్రీహరికోటలో కూడా మరో మూడవ లాంచ్ ప్యాడ్ ను నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ఇస్రో pslv వాహనంలో సరికొత్త టెక్నాలజీ తో pslv..N1 సిరీస్ తో కొత్త టెక్నాలజీతో pslv లో కొత్త తరహా రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇస్రో ఇప్పటికే ప్రయోగించిన చంద్రయాన్ ద్వారా చంద్రుని పై నీటి జాడలు కనిపించినట్లు సమాచారం. చంద్రయాన్ 4 రాకెట్ ప్రయోగం ద్వారా చంద్రుని నుంచి మట్టినమూనాలు సేకరించి భూమి మీదకు తీసుకురావడం లాంటి భారీ ప్రయోగాలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా అమెరికా, రష్యా, చైనా తర్వాత నాలుగవ దేశంగా భారత్ నిలవనుంది. చంద్రుని దక్షణ ద్రువం వైపు ఉన్న మంచుని కూడా అధ్యయనం చేయడం చంద్రయాన్ మిషన్ లక్ష్యం. ఇస్రో అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఉన్న దేశాల్లో భారత్ మూడవ దేశంగా నిలవనుంది. ఇస్రో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాములను పంపి సురక్షితంగా భూమి మీదకు తీసుకు వచ్చే కల 2040 కల్లా నిజం అవుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు. అయితే అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ముందు గగనయాన్ ప్రయోగానికి సంబంధించిన మరో మూడు మానవరహిత ప్రయోగాలు చేయాలని సూచించారు. 2027 లో అంతరిక్షంలోకి తొలిసారిగా మానవులను పంపే ప్రక్రియ కూడా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి సేవా టికెట్లు రిలీజ్ అప్పుడే
కార్తీకమాసం అద్భుతం.. శివయ్య దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
