శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి సేవా టికెట్లు రిలీజ్ అప్పుడే
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవల టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రభాతం, కళ్యాణోత్సవం, ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు పలు సేవా టికెట్లను నవంబర్ 18 నుండి 25 వరకు వివిధ తేదీల్లో ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలను ప్రకటించింది. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి పలు సేవలు, గదుల కోటా వివరాలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22 వరకు మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. ఇక కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను నవంబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. 21న వర్చువల్ సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. 24 వతేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబర్ 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. నవంబర్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయబోతోంది. ఇక తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కార్తీకమాసం అద్భుతం.. శివయ్య దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు
ఇక ఈ బ్యాంకులు కనిపించవా ?? ఎందుకు ఇలా చేస్తున్నారు ??
తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయి.. పెళ్లితో ఒక్కటైన ప్రేమజంట
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

