ఫోర్బ్స్ కవర్ పేజీపై కోదాడ కుర్రాడు జానీ పాషా
కోదాడకు చెందిన జానీ పాషా, తన స్వయంకృషితో 'లోకల్ యాప్' స్టార్టప్‌ను స్థాపించి, ఫోర్బ్స్ ఇండియా కవర్‌పేజీపై మెరిశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అయిన ఆయన, ఆసియాలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న 100 స్టార్టప్‌లలో ఒకటైన తన యాప్‌తో 238 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన యువకుడి అద్భుత విజయగాథ.
స్వయంకృషి, పట్టుదలతో కోదాడ కుర్రాడు జానీ పాషా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసాడు. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 100 స్టార్టప్ కంపెనీలలో జానీ పాషా స్థాపించిన ‘లోకల్ యాప్’ చేరింది. దీంతో ఫోర్బ్స్ అక్టోబర్ సంచిక కవర్ పేజీపై జానీ పాషా ఫొటోను ప్రముఖంగా ప్రచురించింది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జానీపాష అరుదైన ఈ గౌరవాన్ని పొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు యాకుబ్ పాష కుమారుడైన జానీ పాషా 10వ తరగతి వరకు కోదాడలోనే చదువుకున్నారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ 2018లో ‘లోకల్’ పేరుతో తన మిత్రుడు విపుల్ చౌదరితో కలిసి యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను జానీ పాష కోదాడలోనే లాంచ్ చేశారు. దీనిలో తెలుగు, కన్నడ భాషలలో లోకల్ సమాచారాన్ని అప్పటికప్పుడు అందించే విధంగా తయారు చేశారు. ఏడు సంవత్సరాల కాలంలో ఈ సంస్థ 238 కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించి ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీగా నిలిచింది. దీంతో బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా అక్టోబర్ నెలలో “100 టు వాచ్’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. అందులో జానీ పాషాతో పాటు మరికొందరు స్టార్టప్ ఫౌండర్ల ఫొటోలను ప్రచురించింది. ఈ మ్యాగజైన్‌లో వారు విజయాన్ని ఎలా అందుకున్నారనే అంశాలతో ఇంటర్వ్యూలను పబ్లిష్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: వెండితెర మీద 25 ఏళ్లు పూర్తి చేసుకున్న NTR
Arjun Kapoor: వరుస ఇబ్బందులతో డిప్రెషన్ లోకి వెళ్ళా.. ఇప్పుడు ఇలా..
భన్సాలీ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్.. హీరామండి
ఒకే సీజన్‌లో రానున్న మహేష్, అల్లు అర్జున్.. టాలీవుడ్ గ్లోబల్ వార్ పక్కా
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న హనీ రోజ్.. ఈసారి మోత మోగిపోతాది అంతే
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్‌బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్

