అమ్మో గొరిల్లా.. దెబ్బకు కోతులు పరార్
కరీంనగర్‌లో కోతుల బెడద తీవ్రం కావడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న హోటల్ నడిపే భిక్షపతికి కోతుల వల్ల వ్యాపారం దెబ్బతింది. దీంతో వినూత్నంగా ఆలోచించి, గొరిల్లా డ్రెస్ ధరించి వాటిని తరిమేశాడు. ఈ అద్భుతమైన ఐడియా వల్ల కోతులు హోటల్ వైపు రావడం మానేసాయి, స్థానికుల ప్రశంసలు అందుకున్నాడు.
కోతులు..కోతులు..కోతులు..ఎక్కడ చూసినా కోతుల బెడద ఎక్కువైపోయింది. గ్రామాల్లో చొరబడి మనుషులపై దాడులు చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా దండెత్తి యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కోతుల బీభత్సానికి భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. చిరు వ్యాపారుల దుకాణాలకు వెళ్లి ఆహారపదార్ధాలన్నీ ఎత్తుకెళ్లిపోతున్నాయి. దీంతో ఈ కోతుల బెడదకు చెక్ పెట్టాలనుకున్న వానర బాధితుడు వినూత్నంగా ఆలోచించాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో భిక్షపతి అనే వ్యక్తి చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతని వ్యాపారానికి ఈ కోతులు పెద్ద సమస్యగా మారాయి. వండిన ఆహారాలన్నీ గుంపులు గుంపులుగా వచ్చి కోతులు ఎత్తుకెళ్లిపోతున్నాయి. కస్టమర్ల చేతిల్లోని ఆహారం కూడా లాక్కెళ్లిపోతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. కోతుల కారణంగా ఇటు భిక్షపతి, అటు కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఈ కోతులను ఎలాగైనా అడ్డుకోవాలనుకున్న భిక్షపతి ఆలోచనలో పడ్డాడు. సాధారణంగా కోతులకు కొండముచ్చులు, గొరిల్లాలంటే భయమని తెలుసుకున్నాడు. వెంటనే గొరిల్లా డ్రెస్ ఒకటి కొని తెచ్చుకుని దానిని వేసుకొని హోటల్ నిర్వహిస్తున్నాడు. గొరిల్లా వేషంలో ఉన్న భిక్షపతిని చూసి నిజంగానే గొరిల్లా వచ్చిందనుకుని కోతులు ఆ హోటల్ దరిదాపులకు రావడం మానేసాయి. భిక్షపతి ఆలోచనకు సూపర్ ఐడియా అంటూ స్థానికులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ హోటల్ యజమాని .. విపరీతమైన కోతుల బెడద భరించలేక ఈ డ్రెస్సును కొనుగోలు చేసి ధరించి కోతుల వెంట పడుతున్నానని తెలిపాడు. తనకు మరికొందరు తోడై ఇలా చేస్తే… కోతులను గ్రామం నుంచి తరిమికొట్టవచ్చు అని చెబుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షూటింగ్‌లో జక్కన్న టార్చర్ తట్టుకోలేకపోయా
అప్పు తీర్చమని అడిగినందుకు ఎంత పని చేశావురా ??
మన ఇస్రోకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు.. వచ్చే ఏడాది భారీ టార్గెట్ !!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి సేవా టికెట్లు రిలీజ్ అప్పుడే
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

