AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసేపట్లో పెళ్లి.. అంతలోనే వధువును దారుణంగా..

కాసేపట్లో పెళ్లి.. అంతలోనే వధువును దారుణంగా..

Phani CH
|

Updated on: Nov 19, 2025 | 5:55 PM

Share

ఒక గంటలో పెళ్లి జరగాల్సిన గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చీర, ఖర్చుల విషయంలో వచ్చిన గొడవలో వరుడు సాజన్ బరయ్య తన వధువు సోని రాథోడ్‌ను ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. దీంతో వధువు అక్కడికక్కడే మరణించగా, నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది.

గుజరాత్‌లో దారుణం జరిగింది. మరో గంటలో వధువు మెడలో తాళికట్టాల్సిన వరుడే కాలయముడయ్యాడు. వధువు మీద రాక్షసంగా దాడిచేసి చంపేశాడు. పేదింటికి చెందిన ఆ వధువు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అతడు ప్రవర్తించిన తీరుకు.. మరికొద్ది సేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన నవ వధువు నిస్సహాయంగా కన్నుమూసింది. భావ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. భావ్‌నగర్‌కు చెందిన సాజన్ బరయ్య , సోని రాథోడ్ గత ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు వీరి వివాహం జరగాల్సి ఉంది. బంధువులు, అతిథులు అంతా వివాహం కోసం చేరుకున్నారు. అయితే, పెళ్లికి గంట ముందు రాత్రి 9 గంటల సమయంలో వధూవరుల మధ్య పెళ్లి చీర, ఖర్చుల గురించి వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాజన్, ఇంట్లోని ఇనుప రాడ్‌తో సోనిపై దాడి చేశాడు. చేతులు, కాళ్లపై కొట్టటమే గాక ఆమె తలను గోడకేసి బాదాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు సాజన్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్‌లో జక్కన్న టార్చర్‌ తట్టుకోలేకపోయా

అమ్మో గొరిల్లా.. దెబ్బకు కోతులు పరార్

షూటింగ్‌లో జక్కన్న టార్చర్‌ తట్టుకోలేకపోయా

అప్పు తీర్చమని అడిగినందుకు ఎంత పని చేశావురా ??

మన ఇస్రోకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు.. వచ్చే ఏడాది భారీ టార్గెట్ !!