AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: మహేష్ 100 కోట్లు.. జక్కన్న 200 కోట్లు | 'వారణాసి' నుంచి సాంగ్ రిలీజ్‌

TOP 9 ET News: మహేష్ 100 కోట్లు.. జక్కన్న 200 కోట్లు | ‘వారణాసి’ నుంచి సాంగ్ రిలీజ్‌

Phani CH
|

Updated on: Nov 20, 2025 | 12:46 PM

Share

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ప్యాన్ వరల్డ్ సినిమా వారణాసి. ఈ సినిమా నుంచి రణ కుంభ అంటూ సాగే విలన్ థీమ్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ పాటను ప్రత్యేకంగా కీరవాణి తన యూ ట్యూబ్ ఛానెల్‌లోనే విడుదల చేసారు. మొన్న టైటిల్ రివీల్ చేసిన ఈవెంట్‌లోనే ఈ పాటను అక్కడ ప్లే చేసారు.. ఇప్పుడు బయటికి విడుదల చేసారు.

ఓ పక్క స్టార్ట్ రెమ్యునరేషన్స్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజమౌళీస్ వారణాసి సినిమాలో జక్కన్న, మహేష్ , ప్రియాంక చోప్రాలు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారనే న్యూస్ బయటకి వచ్చింది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్… వారణాసి సినిమా కోసం.. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి ఓ ప్యాకేజ్‌గా జక్కన్న 200 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడని.. మహేష్‌ బాబు 100 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడని.. ఇక ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఎవరు ఎంత తీసుకుంటున్నారన్న దానిపై.. ఈ మూవీ బడ్జెట్‌పై ఇంకా ఎలాంటి అఫీషియల్ డీటెయిల్స్‌ ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఇప్పటి వరకైతే బయటికి రాలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాటలతోనే ట్రోలర్స్‌ను చావుదెబ్బ కొట్టిన ఆది

‘అయ్యా.. నా కొడుకును ఇబ్బంది పెట్టొద్దు!’ రవి తండ్రి రిక్వెస్ట్

బాలయ్యను క్షమాపణలు కోరిన సీవీ ఆనంద్

SS Rajamouli: అటు పోలీస్ కేసు.. ఇటు టైటిల్ వివాదం! దెబ్బ మీద దెబ్బ!

Pawan Kalyan: శభాష్ సజ్జనార్..! పవన్‌ అభినందనలు