AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనూజ మాస్టర్ ప్లాన్.. దివ్య, భరణికి చెక్‌ మేట్‌

తనూజ మాస్టర్ ప్లాన్.. దివ్య, భరణికి చెక్‌ మేట్‌

Phani CH
|

Updated on: Nov 20, 2025 | 12:50 PM

Share

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగింపు దశకు చేరింది. 11వ వారం నామినేషన్స్ ఉత్కంఠగా మారాయి. కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, డిమాన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. తాజా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం కళ్యాణ్ పడాల టాప్‌లో ఉండగా, సంజనా, దివ్య డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఫ్యామిలీ వీక్ ఓటింగ్ సరళిని మార్చవచ్చని అంచనా.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరుగుతోంది. ఇక అంతకు ముందు ఎప్పటిలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదకొండో వారం నామినేషన్స్ హోరా హోరీగా సాగాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు నామినేషన్స్ లోకి రాని ఇమ్మాన్యుయేల్ మొదటిసారిగా ఈ జాబితాలోకి వచ్చాడు. అలాగే హౌస్ లో డిమాన్ పవన్- రీతూ చౌదరిని నామినేట్ చేయడం.. కూడా బిగ్ షాకింగ్ గా మారింది అందరికీ. ఇలా నామినేషన్స్ పూర్తయ్యేసరికి 11 వ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా ఉన్నారు. ఈ జాబితాలో రీతూ చౌదరి కూడా ఉండాల్సింది. అయితే తన కెప్టెన్సీ పవర్ తో తనూజ రీతూను సేవ్ చేసింది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఈ జబర్దస్త్ బ్యూటీ తప్పించుకుంది. ఇక 11వ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ సోమవారం అంటే నవంబర్ 17 నుంచే ప్రారంభైమంది. సోషల్ మీడియా పోల్స్, ఆన్‌లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. మరోసారి కళ్యాణ్ పడాల నే టాప్‌లో దూసుకెళ్తున్నాడు. ఇక తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చిన ఇమ్మాన్యుయేల్ సెకండ్ పొజిషన్‌ లో ఉన్నాడు.ఇక భరణి థర్డ్ పొజిషన్‌లో ఉండగా, డిమాన్ పవన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సంజనా గల్రానీ ఐదో ప్లేసు, దివ్య నికితా ఆరో ప్లేసులో కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం సంజన, దివ్య డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. అయితే శుక్రవారం అంటే నవంబర్ 21 అర్థరాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అలాగే బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది. కాబట్టి ఓటింగ్ సరళిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: మహేష్ 100 కోట్లు.. జక్కన్న 200 కోట్లు | ‘వారణాసి’ నుంచి సాంగ్ రిలీజ్‌

మాటలతోనే ట్రోలర్స్‌ను చావుదెబ్బ కొట్టిన ఆది

‘అయ్యా.. నా కొడుకును ఇబ్బంది పెట్టొద్దు!’ రవి తండ్రి రిక్వెస్ట్

బాలయ్యను క్షమాపణలు కోరిన సీవీ ఆనంద్

SS Rajamouli: అటు పోలీస్ కేసు.. ఇటు టైటిల్ వివాదం! దెబ్బ మీద దెబ్బ!