అరె.. ముల్లు తీయడం ఇంత ఈజీనా.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియక.. కష్టపడ్డానే
కాలు, చేతుల్లో గుచ్చుకున్న ముల్లును తీయడం కష్టం. తాజాగా ఓ వైరల్ వీడియోలో మహిళ వెల్లుల్లితో వేలిలోని ముల్లును సులభంగా తొలగించింది. ఈ ట్రిక్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అయితే, ఇన్‌ఫెక్షన్లు, ప్రమాదాల నివారణకు వైద్యుల సలహా తీసుకోవడం అత్యవసరం. ప్రత్యామ్నాయ పద్ధతులు అన్ని వేళలా సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎవరికైనా కాలులోనో, చేతిలోనో ముల్లు దిగిందంటే అది తీసేదాకా నిద్ర పట్టదు. గ్రామాల్లో పశువులు మేపేవారికి, వ్యవసాయ పనులు చేసే వారికి ముల్లు గుచ్చుకోవడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల ముల్లులు మాత్రం ఎంత ప్రయత్నించినా బయటికి రావు. విషపు ముల్లుల వల్ల ఇన్‌ఫెక్షన్ అయి కాలు తీసేసిన సందర్భాలు కూడా గ్రామాల్లో కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఓ వీడియో నెటిజన్స్‌ని ఇట్టే అకట్టుకుంటోంది. వేలిలో గుచ్చుకున్న ముల్లును ఓ మహిళ ఎంతో సింపుల్‌గా తీసేసింది. ఈమె టెక్నిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళకు చేతి వేలిలో ముల్లు గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసేందుకు ఆమె నానా తంటాలు పడింది. అయినా ముల్లు మాత్రం బయటికి రాలేదు. ఈ క్రమంలో పక్కనున్న మరో మహిళ వినూత్నంగా ఆ ముల్లును వెల్లుల్లి సహాయంతో చాలా ఈజీగా తీసేసింది. ముందుగా ఆ మహిళ వంటింట్లో వెల్లుల్లిని తీసుకొచ్చింది. దానిని తొక్క తీసి ముల్లు ఉన్న ప్రాంతంలో పెట్టింది. ఆ తర్వాత దానిపై బ్యాండేజ్‌ను అతికించింది. కొన్ని నిమిషాల తర్వాత ఆ బ్యాండేజ్‌ను తీసేసింది. ఆశ్చర్యకరంగా వేలు లోపల ఉన్న ముల్లు పైకి వచ్చింది. ఈ ట్రిక్‌ను చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అయితే కొందరు దీన్ని అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్ కోసం చేసినట్లు ఉందని చెబుతున్నారు. కానీ, వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వాటికి వైద్యుల దగ్గర చికిత్స తీసుకోవాలి. ప్రత్యామ్నాయ పద్దతులు సురక్షితం కావని గుర్తుపెట్టుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐ బొమ్మ రవి.. లైఫ్ స్టైల్ ఇదే !! డబ్బు సంపాదన అంటే ఎందుకంత కసి ??
తనూజ మాస్టర్ ప్లాన్.. దివ్య, భరణికి చెక్ మేట్
TOP 9 ET News: మహేష్ 100 కోట్లు.. జక్కన్న 200 కోట్లు | ‘వారణాసి’ నుంచి సాంగ్ రిలీజ్
మాటలతోనే ట్రోలర్స్‌ను చావుదెబ్బ కొట్టిన ఆది
‘అయ్యా.. నా కొడుకును ఇబ్బంది పెట్టొద్దు!’ రవి తండ్రి రిక్వెస్ట్
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

