AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhat Zareen: 21 నెలల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. బంగారు పతకం పట్టేసిన తెలంగాణ బిడ్డ

Nikhat Zareen: మొత్తంగా భారత్ ఈ టోర్నీలో 9 బంగారు పతకాలతో పాటు 6 రజత, 5 కాంస్య పతకాలను గెలుచుకొని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో భారత బాక్సర్లు చూపిన తెగువ, రాబోయే ఆసియా క్రీడలు, ఇతర అంతర్జాతీయ టోర్నీలకు మంచి సంకేతమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Nikhat Zareen: 21 నెలల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. బంగారు పతకం పట్టేసిన తెలంగాణ బిడ్డ
Nikhat Zareen
Venkata Chari
|

Updated on: Nov 21, 2025 | 7:13 AM

Share

World Boxing Cup Finals 2025: గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన ‘వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్-2025’లో భారత బాక్సర్లు సత్తా చాటారు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించగా, భారత జట్టు రికార్డు స్థాయిలో పతకాల పంట పండించింది.

నిఖత్ జరీన్ ఘన విజయం..

51 కేజీల విభాగంలో పోటీపడిన నిఖత్ జరీన్, ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన గువో యి-జువాన్‌పై 5-0 తేడాతో ఏకగ్రీవ విజయం సాధించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొంత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. సెమీఫైనల్స్‌లో ఉస్బెకిస్తాన్‌కు చెందిన గనియేవా గుల్సేవర్‌ను ఓడించి ఫైనల్ చేరిన ఆమె, తుది పోరులోనూ అదే జోరును కొనసాగించి స్వర్ణం కైవసం చేసుకుంది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం.

భారత బాక్సర్ల రికార్డు ప్రదర్శన..

ఈ టోర్నీలో భారత్ రికార్డు సృష్టించింది. మొత్తం 15 మంది భారత బాక్సర్లు ఫైనల్స్‌కు చేరడం భారత బాక్సింగ్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. ఫైనల్ రోజున భారత మహిళా బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

మహిళల విభాగంలో నిఖత్‌తో పాటు జాస్మిన్ లాంబోరియా (57 కేజీలు), మీనాక్షి (48 కేజీలు), ప్రీతి (54 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు) మరియు నుపూర్ (80+ కేజీలు) వంటి స్టార్ బాక్సర్లు బంగారు పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, హితేష్ గులియా వంటి యువ బాక్సర్లు స్వర్ణ పతకాలు గెలిచి సత్తా చాటారు.

మొత్తంగా భారత్ ఈ టోర్నీలో 9 బంగారు పతకాలతో పాటు 6 రజత, 5 కాంస్య పతకాలను గెలుచుకొని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో భారత బాక్సర్లు చూపిన తెగువ, రాబోయే ఆసియా క్రీడలు, ఇతర అంతర్జాతీయ టోర్నీలకు మంచి సంకేతమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
ఆ ఒక్క వెంట్రుక పీకితే జుట్టు అంతా తెల్లగా అవుతుందా?
ఆ ఒక్క వెంట్రుక పీకితే జుట్టు అంతా తెల్లగా అవుతుందా?
పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా?
పరాగ్‎కు ఛాన్స్ ఇస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‎నే మొగ్గు చూపుతారా?
ఇంట్లో ఉపయోగించే ఆవ నూనె నిజమైనదా లేక నకిలీదా? ఇలా చెక్‌ చేయండి!
ఇంట్లో ఉపయోగించే ఆవ నూనె నిజమైనదా లేక నకిలీదా? ఇలా చెక్‌ చేయండి!
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
తెలుగు రాష్ట్రాల్లో JEE Advanced 2026 పరీక్ష కేంద్రాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో JEE Advanced 2026 పరీక్ష కేంద్రాలు ఇవే..