- Telugu News Photo Gallery Cricket photos 277 players register for Mega Auction and Deepti Sharma amongst 8 Marquee players in WPL 2026
వేలంలోకి 277 మంది ఆటగాళ్లు.. 73 మందికే ఛాన్స్.. అందరిచూపు ఆ 19 మందిపైనే..
WPL 2026 Mega Auction: WPL మొదటి మూడు సీజన్లు పూర్తయిన తర్వాత, ఒక మెగా వేలం జరగనుంది. ఇందులో చాలా మంది ఆటగాళ్ళు జట్లను మార్చనున్నారు. అయితే, ఏ ఆటగాళ్ళు ఏ జట్లకు వెళతారనే దానిపై నవంబర్ 27న న్యూఢిల్లీలో జరిగే వేలంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Updated on: Nov 21, 2025 | 7:44 AM

WPL 2026 Mega Auction: ఐపీఎల్ 2026 (IPL 2026) రిటెన్షన్లు పూర్తవడంతో, డిసెంబర్ 16న జరగనున్న వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అంతకు ముందే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) కొత్త సీజన్ కోసం మెగా వేలం నిర్వహించనున్నారు.

2026 WPL సీజన్ కోసం మెగా వేలం నవంబర్ 27, గురువారం న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 277 మంది ఆటగాళ్ళు నమోదు చేసుకున్నారు. వారిలో 73 మంది మాత్రమే ఈ అవకాశం కోసం అర్హులు. లీగ్ మొదటి మూడు సీజన్లు పూర్తయిన తర్వాత ఇది రెండవ మెగా వేలం.

2026 WPL సీజన్ కోసం మెగా వేలం నవంబర్ 27, గురువారం న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 277 మంది ఆటగాళ్ళు నమోదు చేసుకున్నారు. వారిలో 73 మందికి మాత్రమే ఈ అవకాశం కోసం అర్హులు. లీగ్ తొలి మూడు సీజన్లు పూర్తయిన తర్వాత ఇది రెండవ మెగా వేలం.

సహజంగానే, ఈ వేలంలో భారత్‌లో అత్యధిక ఆటగాళ్లు ఉన్నారు. 194 మందితో, ఆస్ట్రేలియా (23), ఇంగ్లాండ్ (22) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (13), దక్షిణాఫ్రికా (11), వెస్టిండీస్ (4), బంగ్లాదేశ్ (3), శ్రీలంక (3), యుఎఇ (2), థాయిలాండ్, యుఎస్ఎ (ఒక్కొక్కరు) ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొననున్నారు.

మార్క్యూ ఆటగాళ్లు మొదటగా బిడ్‌లోకి రానున్నారు. వీరిలో ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి. దీప్తి శర్మ, అలిస్సా హీలీ, లారా వోల్వార్డ్ట్, మెగ్ లాన్నింగ్, రేణుకా సింగ్, సోఫీ ఎక్లెస్టోన్, అమేలీ కేర్, సోఫీ డివైన్. వోల్వార్డ్ట్ (3 కోట్లు), రేణుక (4 కోట్లు) తప్ప, మిగతా వారందరికీ 5 కోట్ల బేస్ ధరలో ఉన్నారు.

ఈ 277 మంది ఆటగాళ్లలో 19 మంది తమ బేస్ ధరను రూ. 5 కోట్లుగా నిర్ణయించారు. అత్యల్ప బేస్ ధర రూ. 1 కోటి, ఇది అన్ని అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు నిర్ణయించారు. మొత్తం 155 అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు (భారతీయ, విదేశీయులతో సహా) ఈ వేలంలో పాల్గొంటున్నారు. 83 మంది విదేశీ ఆటగాళ్లలో నలుగురు అసోసియేట్ దేశాలకు చెందినవారు.
