Cricket: టెస్ట్ క్రికెట్‌ను వన్డేల్లా ఆడిన మొనగాళ్లు వీరే.. లిస్టులో నెంబర్‌వన్ టీమిండియా కింగ్
టెస్ట్ క్రికెట్‌ను తమ దూకుడు బ్యాటింగ్‌తో మార్చేసిన ఐదుగురు అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మెన్లు ఎవరో ఇక్కడ తెలుసుకోండి. టెస్ట్ కెరీర్ స్ట్రైక్ రేట్, కనీసం 5000 పరుగులు, 50 టెస్టులు, 40 సగటుతో వీరంతా బౌలర్లను వణికించి పరుగులు రాబట్టారు. ఆ వివరాలు ఇలా..

టెస్ట్ క్రికెట్ అనగానే బ్యాట్స్‌మెన్ ఓపికగా, నిలకడగా ఆడే ఫార్మాట్ అని అందరూ భావిస్తారు. కానీ, కొందరు ఆటగాళ్లు మాత్రం తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ సంప్రదాయాన్ని తిరగరాశారు. కనీసం 50 టెస్టులు ఆడి, 5000కు పైగా పరుగులు చేసి, 40కి పైగా సగటు కలిగిన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ జాబితాలో ఐదో స్థానంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య నిలిచాడు. 110 టెస్టుల్లో 65.27 స్ట్రైక్ రేట్‌తో దాదాపు 7000 పరుగులు చేసిన అతడు.. ఓపెనర్‌గా బౌలర్లపై ఎదురుదాడి చేయడంలో దిట్ట. అతడి తర్వాత నాలుగో స్థానంలో మరో లంక వీరుడు తిలకరత్నే దిల్షాన్ ఉన్నాడు. తనదైన ‘దిల్-స్కూప్’ షాట్లతో 65.52 స్ట్రైక్ రేట్‌తో అతడు టెస్టుల్లో అలరించాడు.
ఇది చదవండి: ఇలా తగులుకున్నావ్ ఏంట్రా.! వాడ్ని ఆపలనుకునేలోపే మ్యాచ్ లాగేసుకున్నాడు..
ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిలిచాడు. వన్డే తరహాలోనే టెస్టుల్లోనూ విరుచుకుపడే వార్నర్, 74.02 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను హడలెత్తించాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. ఏ స్థానంలోనైనా, ఏ బౌలర్‌నైనా ఊచకోత కోయగల సామర్థ్యం ఉన్న గిల్‌క్రిస్ట్.. ఏకంగా 81.96 స్ట్రైక్ రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌ను శాసించాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, బ్రెండన్ మెక్కల్లమ్, క్రిస్ గేల్ లాంటివారు ఉన్న విషయం తెలిసిందే.
అయితే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో నంబర్ వన్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ‘నజఫ్‌గఢ్ నవాబ్’గా పేరుగాంచిన సెహ్వాగ్, టెస్ట్ క్రికెట్‌ను టీ20 తరహాలో ఆడి రికార్డులు సృష్టించాడు. 82.21 స్ట్రైక్ రేట్‌తో 104 టెస్టుల్లో 8586 పరుగులు చేసిన అతడు, బౌలర్లకు పీడకలగా మారాడు. ఫార్మాట్ ఏదైనా బంతిని బాదడమే లక్ష్యంగా ఆడే సెహ్వాగ్ శైలి క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ శైలిని పూర్తిగా మార్చేసిన మొనగాళ్లు.
ఇది చదవండి: 15 ఏళ్లు వచ్చాయ్.. అందుకే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. MI, RCBలకు బుడ్డోడి స్ట్రాంగ్ పంచ్
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
