AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK Vs RR: 15 ఏళ్లు వచ్చాయ్.. అందుకే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. MI, RCBలకు బుడ్డోడి స్ట్రాంగ్ పంచ్

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన పుట్టినరోజున పెద్దగా సంబరాలు చేసుకోలేదని, పవర్‌ప్లేలో దూకుడుగా ఆడడమే తన లక్ష్యమని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. రాజస్థాన్ 47 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

CSK Vs RR: 15 ఏళ్లు వచ్చాయ్.. అందుకే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. MI, RCBలకు బుడ్డోడి స్ట్రాంగ్ పంచ్
Vaibhav Suryavanshi
Ravi Kiran
|

Updated on: Mar 31, 2026 | 11:22 AM

Share

ఐపీఎల్ 2026 సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఓ అసాధారణ రికార్డుతో మొదలుపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అతి పిన్న వయసులో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించిన వైభవ్.. గతంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, సురేష్ రైనా, ఇషాన్ కిషన్ లాంటి దిగ్గజాల రికార్డులను అధిగమించాడు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై స్పందించిన వైభవ్, ఇటీవలే తన 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ, పుట్టినరోజు సంబరాలు చేసుకోలేదని వెల్లడించాడు. తన కోసం కేక్ కటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ, కేక్ పూస్తారని భయపడి ముందే నిద్రపోయానని సరదాగా చెప్పాడు. మ్యాచ్‌లో తాను కొత్తగా ఏమీ చేయలేదని, పవర్‌ప్లేలో దూకుడుగా ఆడడమే తన ప్రధాన లక్ష్యమని వివరించాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉన్నా, బంతి పాతబడిన కొద్దీ అది సులభంగా మారిపోయిందని తెలిపాడు. సాధారణంగా డిఫెన్స్ గురించి ఆలోచించే తానూ, ఈ మ్యాచ్‌లో మాత్రం పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలని భావించామని పేర్కొన్నాడు.

లక్ష్యం చిన్నది కావడంతో, ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తే ఆ టార్గెట్‌ కూడా పెద్దదిగా మారే ప్రమాదం ఉందని గుర్తించామని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. అందుకే పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామని తెలిపాడు. తమ కోచ్‌లు కూడా ప్రతి బౌలర్‌పై ఎటాకింగ్ గేమ్ ఆడమని చెప్పరని, బంతిని బట్టి ఆడాలని, తన సహజసిద్ధమైన ఆటను ఆడమని చెబుతారని అన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌తో తన భాగస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ, ప్రతి బంతి తర్వాత యశస్వితో మాట్లాడుతూనే ఉన్నానని, అతను సింగిల్స్ తీస్తూ తనకు స్ట్రైకింగ్ ఇచ్చి, భారీ షాట్లు ఆడేందుకు ప్రోత్సహించాడని వెల్లడించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సాధించిన విజయం బంతుల పరంగా వారికి అతిపెద్ద విజయం కావడం గమనార్హం. చెన్నై సూపర్ కింగ్స్‌పై 47 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ గెలుపొందింది. ఇది సీఎస్‌కేకి ఐపీఎల్ 2026లో రెండో భారీ ఓటమి. అంతకుముందు కేకేఆర్ చేతిలో 59 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో సీఎస్‌కేపై ఎక్కువ విజయాలు సాధించిన మూడో జట్టుగా రాజస్థాన్ నిలిచింది. ఈ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీకి, అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు ఒక చిరస్మరణీయమైన ఆరంభాన్ని ఇచ్చింది.

మరిన్ని ఐపీఎల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us