AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World cup 2023: ఆ విషయంలో రోహిత్ శర్మ ఛీటింగ్ చేశాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్.. ఎవర్రా మీరంతా అంటోన్న నెటిజన్స్..

పాకిస్థాన్ భారత్‌పై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టోర్నీ మధ్యలో పాక్ మాజీ క్రికెటర్లలో ఒకరైన హసన్ రజా కూడా పిచ్, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశాడు. భారత బౌలర్లకు వేరే బంతిని ఇస్తున్నారని, ఆ బంతి నుంచి భారత బౌలర్లు స్వింగ్, సీమ్ పొందారంటూ చెప్పుకోవచ్చు. ఇది కాకుండా, బ్యాటింగ్ చేసే సమయంలోనూ పిచ్ కూడా భిన్నంగా ఉంటుందంటూ కీలక ఆరోపణలు చేశాడు.

World cup 2023: ఆ విషయంలో రోహిత్ శర్మ ఛీటింగ్ చేశాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్.. ఎవర్రా మీరంతా అంటోన్న నెటిజన్స్..
Ind Vs Nz 1st Semi Final
Venkata Chari
|

Updated on: Nov 16, 2023 | 4:37 PM

Share

Rohit Sharma: భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ కీలక ఆరోపణలు చేశాడు. టాస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మోసపూరితంగా వ్యవహరించాడని ఆరోపించాడు. సికందర్ బఖ్త్ ప్రకారం.. రోహిత్ శర్మ నాణేన్ని విసిరినప్పుడు, అతను ఉద్దేశపూర్వకంగా దానిని ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చూడలేనంత దూరం విసిరాడు’ అంటూ ఆరోపణలు గుప్పించాడు.

2023 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. భారత్ తరపున విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు చేయగా, మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న టీమ్ ఇండియా 397 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

టాస్ సమయంలో రోహిత్ శర్మ మోసం చేశాడు – సికందర్ భక్త్ ఆరోపణలు..

పాకిస్తాన్ జియో న్యూస్‌లో జరిగిన సంభాషణలో, సికందర్ భక్త్ రోహిత్ శర్మపై ఈ అసంబద్ధ ఆరోపణలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘మీరు జాగ్రత్తగా గమనిస్తే, రోహిత్ శర్మ నాణెం విసిరినప్పుడల్లా, అతను దానిని ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కు దూరంగా విసిరేస్తాడు. టాస్‌లో ఏం వస్తుందో ఎదురుగా ఉన్న కెప్టెన్ చూడలేక పోతున్నాడు. దీన్ని రోహిత్ శర్మ సద్వినియోగం చేసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదే మొదటిసారి కాదు..

ఈసారి పాకిస్థాన్ భారత్‌పై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టోర్నీ మధ్యలో పాక్ మాజీ క్రికెటర్లలో ఒకరైన హసన్ రజా కూడా పిచ్, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశాడు. భారత బౌలర్లకు వేరే బంతిని ఇస్తున్నారని, ఆ బంతి నుంచి భారత బౌలర్లు స్వింగ్, సీమ్ పొందారంటూ చెప్పుకోవచ్చు. ఇది కాకుండా, బ్యాటింగ్ చేసే సమయంలోనూ పిచ్ కూడా భిన్నంగా ఉంటుందంటూ కీలక ఆరోపణలు చేశాడు.

అయితే, వీటిని పాకిస్తాన్ మాజీలు కొంతమంది తీవ్రంగా ఖంచించారు. ఇలాంటి వారు దేశం పేరు వాడకూడదంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి చెత్త ఆరోపణలు వ్యక్తిగతంగా చేసుకోవాలని సూచించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..