AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Africa vs Australia: వరల్డ్ కప్ చరిత్రలో సౌతాఫ్రికా చెత్త స్కోర్.. అగ్రస్థానం ఎవరిదో తెలుసా?

Lowest PowerPlay scores in ODI World Cup: రెండో సెమీస్‌లో భాగంగా కోల్‌కతాలో ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ మొదలుపెట్టింది. కానీ, ఆ జట్టుకు ఆరంభం మాత్రం చాలా పేలవంగా తయారైంది. 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. అయితే, ఓ దశలో పవర్ ప్లేలో సౌతాఫ్రికా జట్టు కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది.

South Africa vs Australia: వరల్డ్ కప్ చరిత్రలో సౌతాఫ్రికా చెత్త స్కోర్.. అగ్రస్థానం ఎవరిదో తెలుసా?
South Africa Vs Australia, 2nd Semi Final (1)
Venkata Chari
|

Updated on: Nov 16, 2023 | 3:46 PM

Share

Lowest PowerPlay scores in ODI World Cup: రెండో సెమీస్‌లో భాగంగా కోల్‌కతాలో ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ మొదలుపెట్టింది. కానీ, ఆ జట్టుకు ఆరంభం మాత్రం చాలా పేలవంగా తయారైంది. 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. అయితే, ఓ దశలో పవర్ ప్లేలో సౌతాఫ్రికా జట్టు కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో 2 వికెట్లు కోల్పోయింది. అయితే, సౌతాఫ్రికా చేసిన ఈ అత్యల్ప స్కోర్ రెండోదిగా నిలిచింది.

అంతకుముందు శ్రీలంక టీం పవర్ ప్లేలో 6 వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది. అది కూడా భారత్ మ్యాచ్‌లో కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

2015లో పాకిస్తాన్ టీం 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులు (vs జింజాబ్వే) చేసింది. 2011లో కెనడా 3 వికెట్లు కోల్పోయి 14 పరుగులు (vs జింజాబ్వే), 2011లో విండీస్ 3 వికెట్లు కోల్పోయి 18 పరుగులు (vs పాకిస్తాన్) స్కోర్లను నమోదు చేసింది.

ODI ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో అత్యల్ప ఓపెనింగ్ స్కోర్లు..

14/2 పాకిస్థాన్ – జింబాబ్వేపై (2015)

14/6 శ్రీలంక – భారత్‌పై (2023)

14/3 కెనడా – జింబాబ్వేపై (2011)

18/3 వెస్టిండీస్ – పాకిస్థాన్‌పై (2011)

18/2 దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియాపై (2023)

20/3 కెనడా- శ్రీలంకపై (2011)

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఇరుజట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..