IND vs AUS, World Cup Final: చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్న గిల్.. రోహిత్ రియాక్షన్ ఏంటో చూశారా?
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 10 ఓవర్లలోపే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శుభమన్ గిల్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (47), శ్రేయస్ అయ్యర్ (4) పరుగులకే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా శుభారంభం అందించాల్సిన ఓపెనర్ శుభమన్ గిల్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఒక చెత్త షాట్ ఆడి భారీ మూల్యం చెల్లించుకున్నాడు
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 10 ఓవర్లలోపే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శుభమన్ గిల్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (47), శ్రేయస్ అయ్యర్ (4) పరుగులకే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా శుభారంభం అందించాల్సిన ఓపెనర్ శుభమన్ గిల్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఒక చెత్త షాట్ ఆడి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. మిచెల్ స్టార్క్ వేసిన 5 ఓవర్ రెండో బంతిని గిల్ మిడాన్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా మిడాన్‌లో ఉన్న ఆడమ్ జంపా చేతుల్లోకి వెళ్లింది. దీంతో మోడీ స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అదే సమయంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ గిల్ వైపు ఒకింత కోపంతో చూశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో గిల్ అనవసర షాట్ ఆడి ఔటవ్వడంపై రోహిత్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కడపటి వార్తలందే సమయానికి టీమిండియా 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(47), శుభ్‌మన్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4), విరాట్ కోహ్లీ (54) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (52), రవీంద్ర జడేజా (9) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీసుకోగా మిచెట్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్ వెల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
గిల్ ఔట్.. రోహిత్ సీరియస్.. వైరల్ వీడియో
— Sitaraman (@Sitaraman112971) November 19, 2023
ఆశలన్నీ కేఎల్ రాహుల్, సూర్య కుమార్ పైనే..
View this post on Instagram
కోహ్లీ, మ్యాక్సీల ఫ్రెండ్ షిప్..
View this post on Instagram
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.