Video: పెర్త్ నుంచి షాకింగ్ న్యూస్.. ఊరించి, ఉసూరుమనిపించిన రోహిత్, కోహ్లీ..
Australia vs India, 1st ODI: ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. పెర్త్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో, ఆసీస్ పేసర్లు కొత్త బంతితో పూర్తి ప్రయోజనం పొందారు.

Australia vs India, 1st ODI: సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి తిరిగొచ్చిన భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆదివారం (అక్టోబర్ 19, 2025) జరిగిన మొదటి వన్డేలో వీరిద్దరూ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.
ఆసీస్ పేసర్ల దూకుడుకు తలవంచిన ‘రో-కో’ జోడి..
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. పెర్త్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో, ఆసీస్ పేసర్లు కొత్త బంతితో పూర్తి ప్రయోజనం పొందారు.
రోహిత్ శర్మ: స్వల్ప స్కోరుకే ఔట్..
దాదాపు ఏడు నెలల తర్వాత వన్డే జట్టులోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ అతని 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ ప్రత్యేక మ్యాచ్‌లో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లో, అదనపు బౌన్స్‌తో వచ్చిన బంతిని డిఫెండ్ చేయబోయిన రోహిత్, బ్యాట్ అంచుకు తగిలించి సెకండ్ స్లిప్‌లో మాట్ రెన్షాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
విరాట్ కోహ్లీ: డకౌట్..
Virat Kohli O(8) vs Australia, 1st ODI, 2025 Ball by Ball Highlights #AUSvIND pic.twitter.com/5wdjGW9UkL
— Amir (@khano_3) October 19, 2025
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్ కోహ్లీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన కోహ్లీ, ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ సున్నా (డకౌట్) పరుగులకే ఔటయ్యాడు. ఆసీస్ పేసర్ల దాడిలో, భారత్ 6.1 ఓవర్లలో కేవలం 21 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
భారత శిబిరంలో ఆందోళన..
రోహిత్, కోహ్లీల వికెట్లు త్వరగా పడిపోవడంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. పిచ్ పేసర్లకు స్వర్గధామంగా ఉండటంతో, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (శుభ్‌మన్ గిల్ తొలిసారి వన్డే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు). శ్రేయస్ అయ్యర్ లేదా కేఎల్ రాహుల్ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జట్టును కష్టాల నుండి గట్టెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ సిరీస్‌లో భారత్ రాణించాలంటే, ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ ఫామ్‌ను తిరిగి అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పెర్త్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం వార్త రాసే సయానికి 8.5 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (10) కూడా పెవిలిన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అంతకుముందు రోహిత్ శర్మ (8 పరుగులు) జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




