Suryakumar Yadav : ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది సూర్య.. వరుసగా ఫెయిలవుతున్న టీ20 కెప్టెన్‌కు కైఫ్ సలహా
Suryakumar Yadav : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ గత రాత్రి (డిసెంబర్ 14, 2025) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో విఫలమయ్యారు.

Suryakumar Yadav : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ గత రాత్రి (డిసెంబర్ 14, 2025) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లలో ఆయన బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ కేవలం 11 బంతులు ఎదుర్కొని 12 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు.
మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్, సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలం అవ్వడంపై, మూడో మ్యాచ్‌లో చేసిన తప్పును మళ్లీ చేయడాన్ని విమర్శించారు. సూర్యకుమార్ ఫామ్‌పై నిరంతరం ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడారు. కేవలం 118 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు కెప్టెన్ తన సాధారణ స్థానంలో బ్యాటింగ్ చేసి, నాటౌట్‌గా నిలబడి మ్యాచ్‌ను ముగించి ఉండాలని కైఫ్ అభిప్రాయపడ్డారు.
కైఫ్ మాట్లాడుతూ.. “ఈ రోజు సూర్యకుమార్ యాదవ్‌కు నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి మంచి అవకాశం లభించింది. భారత్ మ్యాచ్ గెలవడం ఖాయమైంది. పవర్‌ప్లే కూడా బాగా సాగింది. ఆయన నెంబర్ 3లో వచ్చి క్రీజులో ఎక్కువ సమయం గడపడానికి అలాగే 30 లేదా 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలబడటానికి అవకాశం ఉండేది. టీ20 వరల్డ్ కప్ ముందు రాబోయే మ్యాచ్‌లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండేది” అని అన్నారు.
“సూర్యకుమార్ ఒక పవర్ఫుల్ ప్లేయర్, అతని బ్యాటింగ్ సామర్థ్యంపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కానీ అతను గొప్ప ఆటగాడు కాబట్టే, ప్రస్తుతం అతని ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతనికి బ్యాటింగ్ చేసి నాటౌట్‌గా ఉండి, వరల్డ్ కప్‌కు ముందు మిగిలిన టీ20 మ్యాచ్‌ల కోసం సిద్ధమవడానికి మంచి అవకాశం దొరికింది. ఏ ఆటగాడికైనా ఒకే ఒక ఇన్నింగ్స్ అతని ఫామ్‌ను మార్చగలదు” అని కైఫ్ వివరించారు. ఈ సలహా ద్వారా సూర్యకుమార్ తన ఫామ్‌ను తిరిగి పొందడానికి క్రీజులో సమయం గడపడం ఎంత ముఖ్యమో కైఫ్ నొక్కి చెప్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




