Virat Kohli: ఆ విమర్శలపై మౌనం వీడిన కింగ్ కోహ్లీ.. అందుకే లండన్ వెళ్లానంటూ కామెంట్స్..
IND vs AUS, Virat Kohli: "ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ హార్డ్-ఫైట్ క్రికెట్ ఉంటుంది, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి, పేస్, బౌన్స్ బాగా లభిస్తాయి, అది నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను" అని కోహ్లీ తెలిపారు.

Team India: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌కు సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో గడిపిన సమయం గురించి చివరకు తన మనసులోని మాటను వెల్లడించారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆస్ట్రేలియా (Australia)తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు లండన్‌లో కుటుంబంతో గడిపిన సమయాన్ని “అద్భుతమైన, సంతృప్తికరమైన దశ”గా ఆయన అభివర్ణించారు.
కుటుంబమే ముఖ్యం: విరాట్ కోహ్లీ మాటల్లోనే…
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ముందు, కోహ్లీ దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఈ విరామంపై ఆయన మాట్లాడుతూ, “అవును, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత చాలా కాలం విరామం తీసుకున్నాను. ఈ సమయంలో నేను జీవితాన్ని మళ్లీ ఆస్వాదించాను. ఇన్ని సంవత్సరాలుగా చేయలేనిది, ఇప్పుడు నా పిల్లలతో, కుటుంబంతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపగలిగాను. ఇది చాలా అందమైన, సంతృప్తికరమైన దశ, నేను దీన్ని నిజంగా ఆస్వాదించాను” అని జియోహాట్‌స్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
UKలో కోహ్లీ దంపతుల నివాసంపై చర్చ..
ఐపీఎల్ 2025 (IPL 2025) ముగిసిన తర్వాత కోహ్లీ, అతని భార్య, నటి అనుష్క శర్మ (Anushka Sharma), తమ పిల్లలు వామిక, ఆకాయ్‌లతో కలిసి లండన్‌లో సమయాన్ని గడిపిన సంగతి తెలిసిందే. కోహ్లీ ఎక్కువగా లండన్‌లో గడపడం, అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ (Rajkumar Sharma) కూడా కోహ్లీ త్వరలో లండన్‌లో స్థిరపడాలని యోచిస్తున్నారని సూచించడంతో, కోహ్లీ విదేశాలకు మకాం మారుస్తున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది. ఈ చర్చలు ఉన్నప్పటికీ, కోహ్లీ తన రిటైర్మెంట్ తర్వాత కూడా వన్డే క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టారు.
అయితే, యునైటెడ్ కింగ్‌డమ్‌లో గడిపిన ఈ సమయంలో ఆయన విశ్రాంతి తీసుకోవడమే కాకుండా, రాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం లండన్‌లో ఇండోర్ శిక్షణలో కూడా పాల్గొన్నారు. ఈ విరామం కోహ్లీకి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడానికి, కుటుంబంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, అలాగే తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవడానికి బాగా ఉపయోగపడిందని స్పష్టమవుతోంది.
ఆస్ట్రేలియాతో పోరాటానికి సిద్ధం..!
Exclusive: Virat Kohli’s first interview after Test retirement on Fox Cricket. pic.twitter.com/OBdqC6NbKJ
— ADITYA (@Wxtreme10) October 19, 2025
విరామం ముగిసిన తర్వాత, కోహ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ODI సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఆస్ట్రేలియా అంటే తనకు ప్రత్యేకమైన బంధం ఉందని, అక్కడ క్రికెట్ ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. “ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ హార్డ్-ఫైట్ క్రికెట్ ఉంటుంది, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి, పేస్, బౌన్స్ బాగా లభిస్తాయి, అది నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను” అని కోహ్లీ తెలిపారు.
నిరాశ పరిచిన కోహ్లీ..
ఇంత గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 8 బంతులు ఆడిన కోహ్లీ పరుగులు ఏమీ చేయకుండానే పెవిలియన్ చేరి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








