Delhi Capitals: ఆసీస్ దిగ్గజానికి బిగ్ షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ పదవి నుంచి తొలగింపు..
Ricky Ponting: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రికీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2016లో అతను జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. అయితే, ఇప్పుడు ఫ్రాంచైజీ అతనిని ఈ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. దీంతో రికీ పాంటింగ్‌కు బిగ్ షాక్ తగిలినట్లైంది. కోట్లలో నష్టం కూడా వాటిల్లనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతనికి ఒక సీజన్‌కు రూ. 3.5 కోట్లు ఇస్తుంది. పాంటింగ్ పదవీ విరమణ చేసిన వెంటనే, అతని కోట్ల రూపాయల జీతం ఆగిపోతుంది.
Ricky Ponting: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రికీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2016లో అతను జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. అయితే, ఇప్పుడు ఫ్రాంచైజీ అతనిని ఈ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. దీంతో రికీ పాంటింగ్‌కు బిగ్ షాక్ తగిలినట్లైంది. కోట్లలో నష్టం కూడా వాటిల్లనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతనికి ఒక సీజన్‌కు రూ. 3.5 కోట్లు ఇస్తుంది. పాంటింగ్ పదవీ విరమణ చేసిన వెంటనే, అతని కోట్ల రూపాయల జీతం ఆగిపోతుంది. IPL 2024 సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అంతగా బాగోలేదు. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేక ఆరో స్థానంలో నిలిచింది. ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు.
రికీ పాంటింగ్ ఏడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగాడు. కానీ, ఢిల్లీ జట్టు టైటిల్ టైలిట్ గెలవలేకపోయింది. పాంటింగ్ హయాంలో అత్యుత్తమ ప్రదర్శన 2020లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడం. ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. పాంటింగ్ ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఏడు సీజన్లలో మూడింటిలో ప్లేఆఫ్‌లు ఆడింది. ఈ ఫైనల్స్‌లో ఒకటి కూడా గెలవలేకపోయింది. మిగిలిన నాలుగు సీజన్లలో ప్లేఆఫ్‌లకు దూరంగా ఉంది. వీటి నుంచి బయటపడిన తర్వాత పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ ప్లేఆఫ్‌కు వెళ్లలేకపోయింది. ఆ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. ఇక 2023లో తొమ్మిదో ర్యాంక్, 2022లో ఐదో ర్యాంక్, 2021లో మూడో, 2019లో మూడో, 2018లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
Thank you, Ricky! 💙❤️ pic.twitter.com/D6gt7UbLpW
— Delhi Capitals (@DelhiCapitals) July 13, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ‘X’ హ్యాండిల్‌లో ఈ మేరకు థాంక్యూ రికీ అంటూ రాసుకొచ్చింది. పాంటింగ్ ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడు, ఢిల్లీ యువ కెప్టెన్ల వైపు వెళ్లింది. 2018లో రికీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్నాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అతను గాయపడినప్పుడు, రిషబ్ పంత్ కమాండ్ తీసుకున్నాడు. ఇప్పటికీ కెప్టెన్‌గా ఉన్నాడు. 2023లో ప్రమాదం కారణంగా పంత్ ఆడలేకపోవడంతో డేవిడ్ వార్నర్ సారథిగా నడిపించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..