IPL 2024: ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. సోషల్ మీడియాలో తలా ఫ్యాన్స్‌కు ‘వార్నింగ్’ మెసేజ్..
Quinton de Kock wife Sasha: ధోనీ బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ భార్య కూడా భయపడింది. ఈ భయానక సందేశం ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, లక్నోలోని అభిమానులు అతను బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చాలా ఉత్సాహంగా ఉన్నారు.

Quinton de Kock wife Sasha: లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని తన తుఫాను బ్యాటింగ్‌తో అభిమానులను పూర్తిగా అలరించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. 9 బంతుల్లో 28 పరుగులతో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ధోని ప్రతి షాట్‌తో స్టేడియం హోరెత్తింది. ఈ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి రాగానే అభిమానుల సందడి బాగా పెరిగి స్మార్ట్ వాచ్‌లో వార్నింగ్ మెసేజ్ కనిపించింది.
ధోనీ బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ భార్య కూడా భయపడింది. ఈ భయానక సందేశం ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, లక్నోలోని అభిమానులు అతను బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ధోని వచ్చే సమయానికి స్టేడియం సౌండ్ లెవల్ బాగా పెరిగిపోయిందని డి కాక్ భార్య సాషా వెల్లడించింది.
వినికిడి లోపం..
తన స్మార్ట్ వాచ్ ప్రకారం సౌండ్ లెవల్ 95 డెసిబుల్స్‌కు చేరుకుందని సాషా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఇంతలో ఆమె స్మార్ట్ వాచ్‌లో సందేశం అందరి దృష్టిని ఆకర్షించింది. సందేశం చాలా భయానకంగా ఉంది. సందేశం ప్రకారం- ధ్వని స్థాయి 95 డెసిబుల్స్‌కు చేరుకుంది. ఈ స్థాయిలో కేవలం 10 నిమిషాల శబ్దం తాత్కాలిక వినికిడి నష్టం కలిగిస్తుంది’ అంటూ చూపించింది.
ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. కాగా డికాక్ 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు. డికాక్, రాహుల్ మధ్య 134 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..