ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.? ఐపీఎల్ నయా సెన్సెషన్.. త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ
Team India: ప్రస్తుతం ఐపీఎల్‌లో రఫ్ఫాడిస్తూ.. ప్రత్యర్థులకు భారీ షాకులు ఇస్తున్నాడు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. తన జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఎవరో గుర్తుకు వచ్చిందా.. మరో చిన్న విషయం కూడా తెలుసుకుందాం.. గత సీజన్ ఐపీఎల్‌లో వివాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక వివాదంతో హల్ చల్ చేసేవాడు. అయితే, ప్రస్తుతం ఎంతో నేర్పరిగా మారాడు. ప్రతీ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ, వివాదాల జోలికి పోకుండా చాలా ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతూ.. బీసీసీఐ సెలెక్టర్ల చూపులోనూ పడ్డాడు.

MS Dhoni: సెలబ్రెటీలు ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడంతోనే.. తెగ హల్‌చల్ చేస్తుంటాయి. నిత్యం ఎదో ఒక ఫొటోలు నెట్టింట్లో వైరలవుతూనే ఉంటుంది. సినిమా వాళ్లవే కాదు.. బిజినెస్ మెన్స్, క్రీడాకారుల ఫొటోలు కూడా మనకు తారసపడుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి వారి చిన్ననాటి ఫొటోల గురించి అయితే, ఇక చెప్పలేం. వాటిని తెలుసుకునేందుకు జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఫొటోనే ఒకటి సోషల్ మీడియాలో సందడిచేస్తోంది. అయితే, ఈ ఫొటో ఇంతలా చక్కర్లు కొట్టడానికి కారణం.. అందులో ధోని కూడా ఉండడం. ఈ ఫొటోలో ధోనితో పాటు ఓ చిచ్చర పిడుగు కనిపిస్తున్నాడు. ఆయన కూడా ఓ క్రికెటర్.
ప్రస్తుతం ఐపీఎల్‌లో రఫ్ఫాడిస్తూ.. ప్రత్యర్థులకు భారీ షాకులు ఇస్తున్నాడు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. తన జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఎవరో గుర్తుకు వచ్చిందా.. మరో చిన్న విషయం కూడా తెలుసుకుందాం.. గత సీజన్ ఐపీఎల్‌లో వివాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక వివాదంతో హల్ చల్ చేసేవాడు. అయితే, ప్రస్తుతం ఎంతో నేర్పరిగా మారాడు. ప్రతీ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ, వివాదాల జోలికి పోకుండా చాలా ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతూ.. బీసీసీఐ సెలెక్టర్ల చూపులోనూ పడ్డాడు. దీంతో రాబోయే రోజుల్లో భారత జట్టులోనూ ఈ యంగ్ ప్లేయర్‌ని చూడొచ్చన్నమాట. ఇప్పటికీ ఇంకా ఆ ప్లేయర్ ఎవరో గుర్తు పట్టలేకపోయారా.. ఆయనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Guess who is this ? pic.twitter.com/g4mb6OKS1v
— Out Of Context Cricket (@GemsOfCricket) April 17, 2024
పై ఫొటోలో ధోనితో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో కాదండోయ్.. రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2024లో ఆడుతోన్న ప్లేయర్ రియాన్ పరాగ్. క్రికెటర్ రియాన్ పరాగ్ దాస్ దేశవాళీ క్రికెట్‌లో అస్సాం తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఇండియా U19 ఛాలెంజర్ ట్రోఫీ (2017) కోసం భారతదేశం A జట్టులో ఎంపికయ్యాడు. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. డిసెంబర్ 2017లో, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. డిసెంబర్ 2018లో, 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం రాజస్థాన్ రాయల్స్ అతన్ని 20 లక్షలకు కొనుగోలు చేసింది. 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా మారాడు.
10 నవంబర్ 2001న జన్మించిన రియాన్ పరాగ్.. తండ్రి పరాగ్ దాస్, అస్సాం, రైల్వేస్, ఈస్ట్ జోన్ క్రికెట్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. చాలా సంవత్సరాల క్రితం, అతని తండ్రి పరాగ్ దాస్, ఎంఎస్ ధోని కలిసి ఖరగ్‌పూర్, గౌహతిలో జరిగిన రైల్వేస్ టోర్నమెంట్‌లలో పాల్గొన్నారు.
రియాన్ పరాగ్ కెరీర్..
10 year challenge pic.twitter.com/U4XYwACHuD
— TATA IPL 2024 Commentary #IPL2024 (@TATAIPL2024Club) April 17, 2024
ఫస్ట్ క్లాస్: 29 మ్యాచ్‌లు, 1798 పరుగులు, 50 వికెట్లు
లిస్ట్-ఏ: 49 మ్యాచ్‌లు, 1720 పరుగులు, 50 వికెట్లు
T20: 101 మ్యాచ్‌లు, 2224 పరుగులు, 41 వికెట్లు
IPL: 61 మ్యాచ్‌లు, 918 పరుగులు, 4 వికెట్లు, హాఫ్ సెంచరీలు 5
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..