శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే.!
ఐపీఎల్ 2024 ఎంటర్‌టైన్మెంట్ పీక్స్‌కు చేరింది. ప్లే-ఆఫ్స్ స్పాట్ లక్ష్యంగా అన్ని జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ప్రస్తుతం టాప్ 4లో రాజస్తాన్, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ జట్లు స్థిరంగా కొనసాగుతుండగా..

ఐపీఎల్ 2024 ఎంటర్‌టైన్మెంట్ పీక్స్‌కు చేరింది. ప్లే-ఆఫ్స్ స్పాట్ లక్ష్యంగా అన్ని జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ప్రస్తుతం టాప్ 4లో రాజస్తాన్, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ జట్లు స్థిరంగా కొనసాగుతుండగా.. లక్నో, ఢిల్లీ, గుజరాత్ టీమ్స్ గట్టి పోటీనిచ్చేందుకు చూస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే.. ఈ సీజన్‌లో వారి స్థాయి కంటే.. ఎక్కువగానే ప్రదర్శన కనబరుస్తారని అనుకుంటే.. పూర్తిగా నిరాశపరిచారు. వేలంలో కోట్లు కురిపించి.. కొనుగోలు చేసినా.. అట్టర్ ప్లాప్ షోతో అట్టడుగున నిలిచారు. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.. దాదాపుగా అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే..! మరి ఆ ప్లేయర్స్ ఎవరో చూసేద్దాం..
అందరికంటే ముందు వరుసలో ముంబై నుంచి బెంగళూరు ట్రేడ్ అయిన ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్(రూ. 17.5 కోట్లు) ఉన్నాడు. అతడు ఈ సీజన్‌లో 5 మ్యాచులాడి.. కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా 2 వికెట్లు తీశాడు. అటు మ్యాక్స్‌వెల్(రూ.14 కోట్లు) పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే.. మ్యాచుల్లో 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నాడు. ఇక టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆరు మ్యాచులాడి.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఏకంగా అతడి ఎకానమీ రేటు 10.41గా ఉంది. బెంగళూరు ఇతడిని దాదాపు రూ. 9 కోట్లకు రిటైన్ చేసుకుంది. అటు సామ్ కర్రన్(రూ. 18.25 కోట్లు) ఆరు మ్యాచులాడి 126 పరుగులు, 8 వికెట్లు తీశాడు.
మరోవైపు రూ. 15 కోట్ల ట్రేడ్‌కు ముంబై సొంతం చేసుకున్న హార్దిక్ పాండ్యా అట్టర్ ఫ్లాప్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచులాడి హార్దిక్ కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు. కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్(రూ.24.75 కోట్లు) 6 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసి.. 10.55 ఎకానమీతో కొనసాగుతున్నాడు.